.

.

nani

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఆలూ కుర్మా / Aloo kurma


బంగాళా దుంపలు  అందరు ఇష్టపడే వాటిల్లో ఒకటి . కనీసం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని తినొచ్చు,అలాగే ఏ వంటకైనా కాంబినేషన్ గా వండుకోవచ్చు .. సాంబార్ లో, వెజిటేబుల్ బిర్యానీలో,మటన్ లో కూడా కొంచెం  పెద్ద ముక్కలు కోసి వేస్తే  అందులో ఉడికిన బంగాళా దుంప ముక్కల రుచి చాలా బాగుంటుంది .బంగాళాదుంప చిప్స్ ఇష్టపడని వాళ్ళు ఉండరు .. ఆరోగ్యానికి మంచిది కాదని భయపడ్డా తినకుండా మాత్రం ఉండలేము..

 ఇప్పుడు నేను చేసి ఆలూ కుర్మా  తెలియని వాళ్ళుండరు .. వెజిటేబుల్ బిర్యాని,రోటి,చపాతి ఇలా ఎందులోకైనా ఆలూ కుర్మా లేకపోతే  వాటి టేస్ట్ తెలియదు .. 



  కావలసినవి

బంగాళా దుంపలు - 1/2 kg
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
క్యారట్  - 2
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 6
పచ్చికొబ్బరి - 1/2 చిప్ప
లవంగాలు - 3
యాలకులు - 2
అనాసపువ్వు - కొద్దిగా
జాపత్రి - కొద్దిగా
కరివేపాకు - 2 రెమ్మలు
పుదీనా- కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - 1/2 టీ  స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1/2 టేబుల్ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు



తయారు చేసే విధానం

బంగాళా దుంపలు శుభ్రంగా కడిగి,చెక్కు తీసి 
కొంచెం పెద్దముక్కలు కోసి పెట్టాలి .

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరగాలి .
క్యారట్ సన్నగా తురుముకోవాలి

పచ్చికొబ్బరి,లవంగాలు,యాలకులు,అల్లం ముక్కలు ,
వెల్లుల్లి ,మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టాలి .

ప్యాన్ లో నూనె వేసి బాగా కాగాక, అనాసపువ్వు,జాపత్రి వేసి 
మంచి వాసన  వచ్చేలా వేయించాలి .

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు,
పుదీనా,పసుపు,ఉప్పు వరసగా వేస్తూ వేయించాలి . 

వేగిన ఉల్లిపాయల్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టిన పచ్చికొబ్బరి మసాలా 
వేసి, పచ్చివాసన పోయేదాక వేయించాలి . 

 మసాలా వేగగానే తురిమిన క్యారట్ వేసి 
2 నిమిషాలు మగ్గించాలి . 

2 నిమిషాల తర్వాత బంగాళాదుంప ముక్కలు, కారం వేసి, 
బాగా కలిపి మూతపెట్టి  5 నిమిషాలు ఉడకనివ్వాలి. 

ఇందులో 1 కప్పు నీళ్ళు పోసి కూర చిక్కగా 
అయ్యేదాకా ఉడికించాలి . 

చివరిగా కొత్తిమీర చల్లితే ఆలూ కుర్మా రెడీ .. 
ఈ కూర వెజిటేబుల్ బిర్యానీ లోకి, రోటీలు,చపాతీలోకి బాగుంటుంది . 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు