.

.

nani

13, సెప్టెంబర్ 2014, శనివారం

అరటిపండు చపాతీ / Banana Chapati


చపాతీ ఎప్పుడూ చేసుకునేదే కాకుండా ఆలూతో,మెంతి తో ఇలా ఇంకా చాలా రకాలు చేస్తూ ఉంటాము కదా . ఇప్పుడు ఇంకొంచెం కొత్తగా అరటిపండుతో చేసిన బనానా చపాతీ మరీ తీపిగా , స్పైసీ గా కాకుండా
చక్కని బనానా ఫ్లేవర్ తో స్వీట్ స్మెల్ తో చాలా బాగుంది . ఉదయం టిఫిన్ లో కానీ సాయంత్రం కానీ తినటానికి బాగుంటాయి.. పిల్లలు కూడా ఇష్టంగా తినే టిఫిన్.. 


 కావలసినవి 

గోధుమపిండి  - 2 కప్పులు 
అరటి పళ్ళు - 2
తేనే - 1 టేబుల్ స్పూన్ 
వెన్న -  2 టేబుల్ స్పూన్లు 
పంచదార - 2 టీ  స్పూన్లు 
ఉప్పు - 1/4 టీ స్పూన్ 
నెయ్యి - వేయించటానికి సరిపడా 


తయారు చేసే విధానం 

అరటి పళ్ళు బాగా మెత్తగా పండినవి  కావాలి .. 
ఒక్కోసారి ఎవరు తినకుండా మిగిలిపోయి పడేస్తాము.. 

ఈ చపాతీ చేయటానికి అరటి పళ్ళు  
బాగా మగ్గినవైతే  రుచి బాగుంటుంది .


ఒక గిన్నెలో అరటి పళ్ళు ,తేనె ,వెన్న,ఉప్పు,
పంచదార వేసి బాగా మెత్తగా మెదపాలి


మెదిపిన ఈ అరటి పండు మిశ్రమంలో 
గోధుమ పిండి వేసి,బాగా కలపాలి. 


 అరటిపండు పేస్ట్ లోనే పిండి ముద్దవుతుంది.  
కొంచెం కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు . 

పిండిని బాగా పిసికి మెత్తని ముద్ద  తయారు చేయాలి . 


ఈ ముద్దను గుండ్రంగా సమాన భాగాల్లో 
ఉండలు చేసి పెట్టుకోవాలి  


ఉండలను చపాతీ కర్రతో చపాతీలు వత్తి  
ఒకదానికి ఒకటి అంటుకోకుండా పేపర్ మీద వేయాలి. 


పెనం కాగాక నెయ్యి వేసి చపాతీలు 
2 వైపులా బాగా వేయించాలి .. 

బనానా చపాతీలు చక్కటి అరటిపండు వాసనతో ,
రుచిగా చాలా బాగుంటాయి  


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు