.

.

nani

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఆకు కూరల పులుసు

రకరకాల ఆకుకూరల తో పప్పులు,పులుసులు,ఫ్రైలు  చేసుకుంటూ ఉంటాము..అలాగే అన్ని రకాల ఆకు కూరలు కలిపి చేసుకునే ఆకుకూరల పులుసు చాలా బాగుంటుంది . 



కావలసినవి 

ఆకుకూరలు 
పాలకూర - 1 కట్ట 
మెంతి కూర - 1 కట్ట 
పెరుగు తోట కూర - 1 కట్ట 
కొయ్య తోట  కూర - 1 కట్ట
గోంగూర - 1 కట్ట 
కొత్తిమీర - 1 కట్ట 
పసుపు - 1 టీ  స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా 
కారం -  1 టేబుల్ స్పూన్ 

తాలింపు కోసం 

నూనె - 2 టేబుల్ స్పూన్లు 
తాలింపు గింజలు - 1 టేబుల్ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు -6
ఉల్లిపాయ - 1 (ముక్కలు )
ఎండుమిర్చి - 2
కరివేపాకు - 3 రెమ్మలు 
 

తయారుచేసే విధానం 

ఆకు కూరలన్నీ విడి విడిగా కడిగి,సన్నగా తరిగి పెట్టాలి. 

కుక్కర్ లో  1 కప్పు నీళ్ళు పోసి , తరిగిపెట్టిన 
ఆకుకూరలు , పసుపు,కారం ,ఉల్లిపాయ ముక్కలు ,
2 వెల్లుల్లి రెబ్బలు వేసి,కుక్కర్  మూత  పెట్టి,
3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి . 

ఉడికిన ఆకుకూరల్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి . 

బాండీలో నూనె వేసి కాగాక  తాలింపు గింజలు వేసి,వేగగానే
సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, చితక్కొటిన వెల్లుల్లి రెబ్బలు,
ఎండుమిర్చి ముక్కలు,కరివేపాకు,కొంచెం కొత్తిమీర 
వరసగా వేసి వేయిస్తూ తాలింపు తయారు చేయాలి . 

ఈ తాలింపుని మెత్తగా మెదిపి పెట్టిన ఆకుకూరల పులుసులో వేసి 
  బాగా కలిపి, కొంచెం కొత్తిమీర చల్లాలి . 

మూతపెట్టి 5 నిమిషాలు అలాగే ఉంచితే తాలింపులో 
ఆకుకూరల పులుసు బాగా మగ్గుతుంది . 
ఈ కూర అన్నంలో,చపాతీ,రోటీల్లో చాలా బాగుంటుంది .

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు