.

.

nani

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

చికెన్ ఖీమా కర్రీ / Chicken Keema Curry


ఖీమా అంటే మటన్ తోనే కాదు చికెన్ తో కూడా బాగుంటుంది . మా చిన్న పాపకి మటన్ అంటే అంతగా నచ్చదు అందుకే తన కోసం నేను చేసే  ఖీమా ఇది . హెవీగా తిన్నట్లు అనిపించకుండా లైట్ ఫుడ్ గా అనిపిస్తుంది.  అన్నంలో,రోటీల్లో , చపాతీల్లో బాగుంటుంది .. దీనికి మంచి కాంబినేషన్ సాంబార్ ,రసం ..





కావలసినవి 

చికెన్ ఖీమా - 1 kg
ఉల్లిపాయలు - 4 పెద్దవి
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
పసుపు - 1 టీ  స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్ 
నూనె - 1 కప్పు

కీమా మసాలా పొడి కోసం 
కావలసినవి

ఎండుకొబ్బరి ముక్కలు - 1/2 కప్పు
ఎండుమిర్చి - 6 
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్నముక్క
ధనియాలపొడి - 1/2 టీ స్పూన్
మిరియాలు - 4
వెల్లుల్లి రెబ్బలు - 4


 తయారు చేసే విధానం 

 ఖీమా ని శుభ్రంగా కడిగి,ఇందులో  పసుపు అల్లం వెల్లుల్లిపేస్ట్,
కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టాలి . 

బాండీలో నూనె లేకుండా ఎండు కొబ్బరి ముక్కలు,
ఎండుమిర్చి ముక్కలు ,లవంగాలు,యాలకులు,దాల్చిన చెక్క 
అన్నీ వేసి దోరగా వేయించాలి . 

చల్లారిన తర్వాత మిక్సీలో వేయించి పెట్టుకున్న 
మసాలా దినుసులు, ధనియాల పొడి,వెల్లుల్లి రెబ్బలు వేసి 
మెత్తగా పొడి చేసి పక్కన పెట్టాలి .


బాండీలో నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు వేసి, వేగగానే
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,కరివేపాకు ,పుదీనా 
పసుపు,ఉప్పు వేసి వేయించాలి. 

  వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 
పచ్చివాసన పోయేదాకా వేయించాలి . 


ఇందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న 
ఖీమా వేసి బాగా కలపి , 10 నిమిషాలు ఉడకనివ్వాలి . 


10 నిమిషాల తర్వాత నీరంతా ఇగిరిపోయి కూర 
బాగా ఉడుకుతుంది.


ఉడికిన కూరలో ముందుగా తయారుచేసి పెట్టిన 
ఎండుకొబ్బరి మసాలా,కారం,గరం మసాలా వేసి,బాగా కలపాలి.


మసాలా అంతా  కూరకి పట్టేలా బాగా కలిపి, 
1/2 కప్పు నీళ్ళు పోసి,మూత  పెట్టి 
మరొక పది నిమిషాలు  ఉడికించాలి 

 చికెన్ ఖీమా కర్రీ రెడీ ..


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు