.

.

nani

13, సెప్టెంబర్ 2014, శనివారం

చింత చిగురు చికెన్ / Chinta Chiguru Chicken


ఇంతకుముందు రోజుల్లో చింతచిగురు ఒక్క ఎండాకాలం లోనే దొరికేది.. కానీ ఇప్పుడు ఎండాకాలం కాకపోయినా చింతచిగురు వచ్చింది . చింత చిగురు పప్పు,మటన్ లోనే కాదు.  చికెన్ కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుంది .



కావలసినవి 

బోన్ లెస్ చికెన్ - 1/2 k.g 
చింత చిగురు - 1 కప్పు 
ఉల్లిపాయలు  - 2
పచ్చిమిర్చి  -  4
కరివేపాకు - 3 రెమ్మలు 
కొత్తిమీర - కొద్దిగా 
పుదీనా - కొద్దిగా 
పసుపు - 1 టీ స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1 టేబుల్ స్పూన్ 
గరం మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్ 
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 టీ  స్పూన్లు 
కొబ్బరిపొడి - 1 స్పూన్
లవంగాలు - 3
యాలకులు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క 
 నూనె -  1 /2 కప్పు 

తయారు చేసే విధానం 

చింత చిగురుని శుభ్రంగా కడిగి 
పలుచని గుడ్డలో వేసి నీళ్ళు తడి పోయేలా తుడవాలి. 


 చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పసుపు,
కొంచెం అల్లం,వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు,వేసి,
 కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి 


బాండీలో నూనె వేసి కాగాక లవంగాలు,
యాలకులు,దాల్చిన చెక్క వేసి వేగాక,
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,ఉప్పు ,పసుపు,
కరివేపాకు,పుదీనా వేసి వేయించాలి .

అల్లం,వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 
పచ్చివాసన పోయేదాకా వేయించాలి. 


ఇందులో ముందుగా ఉడికించి పెట్టిన చికెన్ వేసి కలిపి,
  మూతపెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.


తర్వాత  కారం,గరం మసాలా,కొబ్బరిపొడి  వేసి బాగా కలపాలి . 
1 కప్పు నీళ్ళు పోసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి.

 
చింత చిగురుని రెండు అరచేతుల మధ్యలో పెట్టి 
మెత్తగా పొడి అయ్యేలా నలపాలి. 



దీన్ని ఉడికిన చికెన్ లో వేసి బాగా కలపాలి .


 మూత పెట్టి చింత చిగురు మగ్గేదాకా ఉడికించాలి . 
చివరిగా కొత్తిమీర చల్లితే టేస్టీ చింత చిగురు చికెన్ రెడీ



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు