.

.

nani

13, సెప్టెంబర్ 2014, శనివారం

కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ / Custard Fruit Salad


కస్టర్డ్ ఫ్రూట్  సలాడ్ పండ్లు అన్నీ కలిపి రుచిగా చేసుకునే  ఆరోగ్యకరమైన 'Dessert' . కొంచెం టైమ్  ఎక్కువగా ఉన్నప్పుడు,ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు భోజనం తర్వాత తినటానికే కాదు సాయంత్రం వేళల్లో కూడా చల్లగా తినటానికి బాగుంటుంది.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు .  కావలసినవి  

ఇష్టమైన పండ్లు ఏవైనా ఉపయోగించొచ్చు. 
 అరటి పళ్ళు - 2
యాపిల్ - 1
దానిమ్మ - 1
ద్రాక్ష - 1 చిన్న కప్పు 
బత్తాయి - 1
జీడిపప్పు - 10
బాదం - 10
కిస్మిస్ - కొద్దిగా 

కస్టర్డ్ కోసం కావలసినవి 

కస్టర్డ్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్
పాలు - 3 కప్పులు 
పంచదార -3 టేబుల్ స్పూన్లు తయారు చేసే విధానం

ఒక గిన్నెలో 1 కప్పు పాలు పోసి, 
పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా 
స్మూత్ గా బాగా కలిసేలా కలపాలి.

మిగిలిన 2 కప్పుల పాలను స్టవ్ మీద పెట్టి కాగబెట్టాలి .
పంచదార వేసి కరిగేదాకా గంటెతో కలుపుతూ ఉండాలి. 

కాగిన పాలల్లో ముందుగానే  కస్టర్డ్ కలిపి పెట్టిన 
1 కప్పు పాలను కూడా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి

సన్నని మంటమీద 10 నిమిషాలు కలుపుతూ 
కస్టర్డ్ చిక్కబడే దాకా ఉడికించాలి . 

కస్టర్డ్ చిక్కబడగానే పచ్చివాసన పోయి చక్కని వాసన వస్తుంది .. 
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి . 

ఈ కస్టర్డ్ గిన్నెవేడిగా ఉన్నప్పుడు  ఫ్రిజ్ లో పెట్టకూడదు కాబట్టి 
ఫ్రిజ్ లో నుండి తీసిన చల్లటి నీళ్ళలో 
గిన్నె ఉంచితే త్వరగా చల్లబడుతుంది ..

ఒక వెడల్పాటి గిన్నెలో పండ్ల ముక్కలన్నీ వేసి , 
చల్లబడిన కస్టర్డ్ వేస్తూ బాగా కలాపాలి. 

దీన్ని ఫ్రిజ్ లో 1/2 గంట ఉంచితే 
 చల్లబడి తినటానికి బాగుంటుంది . 

ఇష్టమైన ఫ్రూట్స్ తో ఎప్పుడైనా చేసుకుని తినే 
ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు