.

.

nani

10, సెప్టెంబర్ 2014, బుధవారం

మెంతికూర పప్పు / Menthi Kura Pappu


 
కావలసినవి 

మెంతికూర - 2 కప్పులు 
కందిపప్పు - 1 కప్పు 
ఉల్లిపాయలు - 2
టమాటాలు - 3
పచ్చిమిర్చి - 8
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1 టీ  స్పూన్
పసుపు - చిటికెడు 

తాలింపు కోసం 
నూనె - 1 టేబుల్ స్పూన్ 
ఆవాలు,జిలకర - 1 టీ  స్పూన్
ఎండుమిర్చి - 2
వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు 
కరివేపాకు - 2 రెమ్మలు 


తయారుచేసే విధానం 

 మెంతి కూరని శుభ్రంగా కడిగి,సన్నగా తరగాలి 
టమాటా, ఉల్లిపాయ,పచ్చిమిర్చిలను 
కూడా తరిగి పెట్టాలి .

కుక్కర్ లో కందిపప్పు వేసి 2 కప్పుల నీళ్ళు పోసి ,
తరిగిన మెంతి కూర , టమాటాలు,
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేయాలి. 

ఇందులో పసుపు ,కారం వేసి కుక్కర్ మూత పెట్టి 
4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. 

ఉడికిన పప్పులో తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి.

బాండీలో నూనె వేసి ఆవాలు,జిలకర వేసి, వేగగానే
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , కొంచెం చితక్కొట్టిన 
వెల్లుల్లి రెబ్బలు , ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు 
వేసి వేయించాలి. 

తాలింపు వేగగానే చివరిగా కొత్తిమీర కలిపి 
ఈ తాలింపుని మెదిపి పెట్టిన పప్పులో వేసి బాగా కలపాలి . 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు