.

.

nani

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పాలకోవా దోశలు / PalaKova Dosalu


కోవా మాల్పువా లాగానే కోవా దోశలు కూడా .. మాల్పువా ను పూరీలాగా  డీప్ ఫ్రై చేసి, పంచదార పాకంలో వేస్తే , కోవా దోశలను మాత్రం పెనం మీద దోశ ల్లాగా వేస్తారు .ఎక్కువ తీపి, నూనె ఇష్టపడని  వాళ్లకి ఈ కోవా దోశలు నచ్చుతాయి ... 


 కావలసినవి

పాలకోవా కోసం 
పాలు - 1/2 లీటర్
మిల్క్ మెయిడ్ / కండెన్స్ డ్ మిల్క్ - 1/2 డబ్బా
పంచదార -   1 కప్పు
యాలకుల పొడి - 1 టీ స్పూన్ 

దోశల కోసం

మైదా - 1 కప్పు 
ఉప్మా రవ్వ - 1/4 కప్పు 
ఉప్పు - చిటికెడు 
పంచదార - 1 టేబుల్ స్పూన్
పెరుగు  - 1 కప్పు 
బేకింగ్ పౌడర్ - చిటికెడు
నెయ్యి - దోశలు వేయించటానికి సరిపడా 

షుగర్  సిరప్ కోసం 

పంచదార - 1 కప్పు 
నీళ్ళు - 1/4 కప్పు
యాలకులపొడి - 1 టీ  స్పూన్

తయారు చేసే విధానం 

ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి సన్నని మంట మీద 
మధ్య మధ్య కలుపుతూ మరిగించాలి . 

పాలు చిక్కగా మరిగి సగం అయ్యాక, పంచదార, 
యాలకులపొడి వేసి బాగా కలపాలి.

చివరిగా కండెన్స్ డ్ మిల్క్  కూడా కలిపి, 
పాలకోవా చిక్కగా దగ్గరికి ముద్దగా 
అయ్యేదాకా ఉడికించి, తయారయిన కోవా పక్కన పెట్టాలి. 


 ఒక గిన్నెలో మైదా,ఉప్మారవ్వ,ఉప్పు,పంచదార ,బేకింగ్ పౌడర్ 
వేసి బాగా కలిపి, పెరుగు వేసి కలపాలి .

పెరుగు సరిపోకపోతే కొంచెం నీళ్ళు కలిపి 
జారుగా దోశల పిండి కలపాలి.

ఈ పిండిని 1 గంట పక్కన పెట్టి నాననివ్వాలి. 


ఒక గిన్నెలో పంచదార, నీళ్ళు పోసి చిక్కగా 
పాకం అయ్యేదాకా మరిగించాలి. 
 యాలకులపొడి వేసి పక్కన పెట్టాలి. 

స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కాక పెనం మీద
అట్టు వేసి రెండువైపులా నెయ్యి వేసి క్రిస్పీగా వేయించాలి .


దోశలను తయారు చేసి పెట్టిన పంచదార పాకంలో 
ముంచి, తీసి పక్కన ప్లేట్ లోపెట్టాలి . 



తయారయిన  దోశలలో ఇష్టమైనంత పాలకోవా పెట్టి, 
మడవాలి . 

రుచిగా ఉండే పాలకోవా దోశలు  రెడీ



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు