.

.

nani

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పనీర్ పొటాటో చీజ్ బాల్స్ / Paneer Potato Cheese Balls


ఎక్కడ చూసినా వర్షాలు, చల్లటి వాతావరణం, వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలని అనిపిస్తున్నప్పుడు ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాకుండా కొంచెం వెరైటీగా చేసిన "పనీర్ పొటాటో చీజ్ బాల్స్" చాలా బాగున్నాయి . మా ఇంట్లో అందరికీ నచ్చాయి ..





కావలసినవి 

బంగాళా దుంపలు - 2 పెద్దవి
క్యారట్ - 2
ఉల్లిపాయ - 1 పెద్దది 
పచ్చిమిర్చి -2 
కొత్తిమీర - కొద్దిగా 
పుదీనా - కొద్దిగా
పనీర్ - 100 గ్రాములు
కార్న్ ఫ్లోర్ - 1 కప్పు 
చీజ్ - 3/4 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా 
పంచదార - 1/2 టీ  స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1/2 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి - 1 టీ స్పూన్
 నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


తయారు చేసే విధానం 

పనీర్ తురిమి పెట్టాలి . 
క్యారట్ ని కూడా బ్లెండర్ లో  సన్నగా తురమాలి. 

బంగాళాదుంపలు కొంచెం ఉప్పు వేసి ఉడికించి 
పొట్టు తీసి పెట్టాలి. 

ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమీర,పుదీనాలను 
సన్నగా ముక్కలు తరిగి పెట్టాలి 


  ఒక వెడల్పాటి గిన్నెలో మెదిపిన బంగాళా దుంపలు 
వేసి  మెత్తగా మెదపాలి .

 ఇందులో తురిమిన పనీర్,క్యారట్ , 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర,పుదీనా,

అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కార్న్ ఫ్లోర్, 
చీజ్, కొంచెం ఉప్పు,పంచదార వేసి బాగా మెత్తగా కలపాలి . 


కార్న్ ఫ్లోర్ ని నీళ్ళలో చిక్కగా కలిపి 
ఇందులో  తయారు చేసి పెట్టిన బాల్స్ ను ముంచి , 
 వెంటనే తీసి కాగుతున్న నూనె లో వేయించాలి .


స్టవ్  మీడియం మంట మీదపెట్టి  ఫ్రై చేస్తే 
మాడిపోకుండా లోపల కూడా బాగా ఉడుకుతుంది . 


 గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయిస్తే 
పనీర్  పొటాటో చీజ్ బాల్స్ రెడీ 

వీటిని టమాటో కెచప్ తో తింటే చాలా బాగుంటాయి



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు