.

.

nani

15, సెప్టెంబర్ 2014, సోమవారం

సొరకాయ అప్పలు / Sorakaya Appalu


సొరకాయతో కూర,పప్పు,స్వీట్ ఏదైనా రుచిగా ఉంటాయి .. ఏ కూర చేసినా సొరకాయ కొంచెమైనా మిగిలిపోతూనే ఉంటుంది. అలాంటప్పుడు సాయంత్రం వేళల్లో తినటానికి స్పైసీగా,క్రిస్పీగా ఉండే ఈ సొరకాయ అప్పలు చాలా బాగుంటాయి .


  కావలసినవి 

సొరకాయ తురుము - 2 కప్పులు 
బియ్యప్పిండి - 2 కప్పు లు 
పచ్చిమిర్చి - 6
అల్లం - చిన్నముక్క 
జిలకర - 1 టేబుల్ స్పూన్
నువ్వులు - టేబుల్ స్పూన్ 
కరివేపాకు - 2 రెమ్మలు 
పుదీనా - కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా 
పసుపు - చిటికెడు 
నూనె - వేయించటానికి ( డీప్  ఫ్రై ) సరిపడా 


తయారుచేసే విదానం 

సొరకాయ పై చెక్కు తీసి, తురిమి పెట్టాలి 


మిక్సీ జార్ లో పచ్చిమిర్చి,అల్లం,1/2 టేబుల్ స్పూన్ జిలకర,
పసుపు ,కొంచెం ఉప్పు వేసి 
కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టాలి.

సొరకాయ తురుము,బియ్యప్పిండి,సన్నగా తరిగిన కొత్తిమీర,
పుదీనా,కరివేపాకు,  గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చిపేస్ట్,

నువ్వులు,మిగిలిన 1/2టేబుల్ స్పూన్ జిలకర,
ఉప్పు అన్నీ ఒక బౌల్ లో తీసుకోవాలి. 


పిండి ముద్ద చేయటానికి సొరకాయలో నీళ్ళే సరిపోతాయి, 
అలా సరిపోకపోతే కొంచెం  నీళ్ళు చల్లి 
గట్టి ముద్దలా పిండి కలపాలి .


ఈ పిండి ముద్దను నిమ్మకాయలంత సైజ్ లో
ఉండలు చేసుకోవాలి .


ఈ ఉండలను రోటీమేకర్ లో ఒక ప్లాస్టిక్ షీట్ వేసి దాని మీద 
కొంచెం నూనె రాసి పిండి ఉండను పెట్టి పలచగా వత్తాలి .

పలుచగా వత్తిన ఈ అప్పలను కాగిన నూనెలో వేసి
రెండు వైపులా ఎర్రగా అయ్యేలా వేయించాలి


రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ 
సొరకాయ అప్పలు రెడీ


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు