.

.

nani

3, అక్టోబర్ 2014, శుక్రవారం

మసాలా గారెలు / Masala Garelu


ఈ రోజు అమ్మవారికి పాయసం,పులిహోర, లడ్లు తో పాటు 
మసాలా గారెలు కూడా నైవేద్యంగా పెడతారు .

"అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి 
ఆదిపరాశక్తి పాలయమాం .. 
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం"

 అందరికీ దసరా శుభాకాంక్షలు  



కావలసినవి 

మినప్పప్పు - 4 కప్పులు 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 3 రెమ్మలు 
కొత్తిమీర - 1/2 కట్ట 
పుదీనా - 1/2 కట్ట
జిలకర - 1 టీస్పూన్ 
అల్లం ముక్కలు - 1 టీ  స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

తయారుచేసే విధానం 

మినప్పప్పు 6 గంటలు నానపెట్టాలి 

నానిన మినప్పప్పుని శుభ్రంగా కడిగి , గ్రైండర్ లో వేసి 
నీళ్ళు వేయకుండా గట్టిగా పిండి రుబ్బాలి . 

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
అల్లం ముక్కలు,కరివేపాకు,పుదీనా,కొత్తిమీర,
జిలకర తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి .


బాండీలో నూనె పోసి బాగా కాగాక 
కలిపిన పిండిని గారెలు వేసి, 
రెండువైపులా ఎర్రగా అయ్యేలా వేయించాలి . 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు