.

.

nani

12, అక్టోబర్ 2014, ఆదివారం

మటన్ ఖీమా ఫ్రై / Mutton Kheema fry




కావలసినవి

మటన్  ఖీమా - 1 kg
ఉల్లిపాయలు - 4 పెద్దవి
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
పసుపు - 1 టీ  స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 టీ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 కప్పు
ఎండుకొబ్బరి ముక్కలు - 1/2 కప్పు
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చిన చెక్క - చిన్నముక్క
అనాసపువ్వు - 1
జాపత్రి - కొద్దిగా
మరాఠీ మొగ్గ - 2


 తయారు చేసే విధానం 


 ఖీమా ని శుభ్రంగా కడిగి,ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్ట్,
కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టాలి . 


 బాండీలో నూనె వేసి కాగాక  (whole garam masala) 
దాల్చినచెక్క,యాలకులు,లవంగాలు,మరాఠీ మొగ్గ,జాపత్రి 
 వేసి సన్నని మంటమీద వేయించాలి.

వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,
కరివేపాకు ,పుదీనా పసుపు,ఉప్పు వేసి వేయించాలి.
వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి
పచ్చివాసన పోయేదాకా వేయించాలి .

ఇందులో ఎండుకొబ్బరి పొడి కూడా వేసి వేయించాలి.


ఇందులో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న
ఖీమా వేసి బాగా కలపి , 1/2 కప్పు నీళ్ళు పోసి , 
20 నిమిషాలు ఉడకనివ్వాలి .


ఉడికిన కూరలో చివరిగా కారం,గరం మసాలా పొడి 
కూడా వేసి బాగా కలిపి, మూతపెట్టి 10 నిమిషాలు 
ఉడికించి కొత్తిమీర చల్లితే మటన్ ఖీమా ఫ్రై రెడీ 

రోటీల్లోకి, అన్నంలో రసం లేదా 
 సాంబార్ తో కలిపి తింటే బాగుంటుంది 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు