.

.

nani

1, అక్టోబర్ 2014, బుధవారం

కదంబం అన్నం / Kadambam Rice


నవరాత్రులలో దుర్గామాతకు సమర్పించే ప్రసాదాల్లో కదంబం అన్నం ఒకటి . కూరగాయల ముక్కలన్నీ కలిపి చేసే కదంబం అన్నం చాలా బాగుంటుంది .


కావలసినవి

బియ్యం - 3 కప్పులు 
కందిపప్పు - 1 కప్పు 
పచ్చిపప్పు - 1/4 కప్పు 
పసుపు - 1 టేబుల్ స్పూన్ 
సాంబార్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా

కూరగాయలు  

కారట్ తురుము - 1 కప్పు 
దోసకాయ - 1 
బంగాళా  దుంపలు - 2
టమాటాలు - 2
మునక్కాయలు - 2
దొండకాయలు - 2
పచ్చిమిర్చి - 3
కొత్తిమీర - కొద్దిగా 
(మనకిష్టమైన కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు)

తాలింపు కోసం 

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు 
ఆవాలు,జిలకర - 1టీ స్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు 
ఎండుమిర్చి - 3

 

తయారు చేసే విధానం 

బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని 
నీళ్ళు పోసి అన్నం వండాలి . 

కుక్కర్లో పచ్చిపప్పు,కందిపప్పు ,తగినన్ని నీళ్ళు,
పసుపు వేసి పప్పు  వండాలి . 

చింతపండుని నానబెట్టి పులుసు తీసి పెట్టాలి . 

ఒక వెడల్పాటి గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక 
ఆవాలు,జిలకర, ఎండుమిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. 

ఈ తాలింపులో కొంచెం పెద్దవిగా కట్ చేసి పెట్టుకున్న 
కూరగాయ ముక్కలు,పసుపు వేసి బాగా కలిపి 
మూతపెట్టి, ముక్కలు మెత్తగా అయ్యేదాకా మగ్గించాలి . 

( సమయం తక్కువగా ఉన్నప్పుడు 
కూరగాయ ముక్కలు కూడా ముందే ఉడికించి పెట్టుకోవచ్చు )


మగ్గిన కూరగాయముక్కల్లో చింతపండు గుజ్జు వేసి
బాగా కలిపి చింతపండు పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి .


ఇందులో సాంబార్ పొడి, 
తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి . 


ఉడికిన కూరగాయముక్కల్లో ముందుగానే ఉడికించి,
మెదిపిన పప్పు వేసి బాగా కలపాలి .


పప్పు వేసిన తర్వాత 1 గ్లాసు నీళ్ళు పోసి 
10 నిమిషాలు  ఉడికించాలి . 


ఉడికిన ఈ కూరగాయల మిశ్రమంలో 
అన్నం వేసి కలపాలి. 


రుచిగా ఉండే అమ్మవారికి ఇష్టమైన 
కదంబం అన్నం ప్రసాదం రెడీ ..



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు