.

.

nani

18, అక్టోబర్ 2014, శనివారం

పనీర్ కాప్సికమ్ బుర్జి / Paneer capsicum Bhurji


బ్రేక్ ఫాస్ట్ లో అయినా లంచ్ లో అయినా అందరు ఇష్టపడి తినే 
పనీర్ కాప్సికమ్ బుర్జి / Paneer capsicum Bhurji  పనీర్తో చేసే ఫేమస్ వంటల్లో మరొకటి. గుడ్డు తినని వాళ్లకి అచ్చం గుడ్డుతో చేసినట్లే అనిపించే 
వెరైటీ వంట..


 కావలసినవి

పనీర్ తురుము - 3 కప్పులు
కాప్సికమ్ - 1 పెద్దది
ఉల్లిపాయలు - 3 
కొత్తిమీర - కొద్దిగా 
పుదీనా - కొద్దిగా 
కరివేపాకు - 2 రెమ్మలు
గరం మసాలా - 1tbsp
జిలకరపొడి - 1/2 టీ  స్పూన్
ధనియాలపొడి - 1/2 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్
పసుపు - 1/2 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీ  స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్


తయారుచేసే విధానం

పనీర్ ని బ్లెండర్ లో కానీ, తురుము తీసే దానితో కానీ 
పొడిగా చేసి పెట్టాలి . 

కాప్సికమ్ కొంచెం పెద్దముక్కలు కట్ చేయాలి 
ఉల్లిపాయలు సన్నగా తరగాలి. 

ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు,
కరివేపాకు,పుదీనా, పసుపు, వేసి వేగనివ్వాలి

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి 
పచ్చివాసన పోయెదాకా వేయించాలి. 

ఇందులో గరం మసాలా పొడి,ధనియాలపొడి,జిలకరపొడి 
ఉప్పు,కారం  వేసి బాగా కలపాలి . 

మసాలా పొడులన్నీ కొంచెం మగ్గిన తర్వాత 
కొంచెం పెద్దముక్కలుగా కట్ చేసిన కాప్సికమ్ వేసి 
5 నిమిషాలు వేయించాలి. 


ఇందులో తురిమిన పనీర్ వేసి,కొత్తిమీర చల్లి  
బాగా కలిపి , 5 నిమిషాలు మగ్గనివ్వాలి .

తక్కువ సమయంలో రెడీ అయ్యే టేస్టీ  
పనీర్ కాప్సికమ్ బుర్జి రెడీ


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు