.

.

nani

9, నవంబర్ 2014, ఆదివారం

కివి స్క్వాష్ / Kiwi Squash

వర్షం పడుతున్నప్పుడు బజ్జీలు ఎవడైనా తింటాడు కానీ ఐస్ క్రీం తినటమే వెరైటీ అన్నట్లు .. వణికించే చలికాలం అయినా సరే  కూల్ డ్రింక్స్ తాగటం కొందరికి ఇష్టం ..మా ఇంట్లో కూడా అందరూ అలాగే ఇష్టపడతారు. ఎప్పుడూ చేసేవే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ కూడా ట్రై  చేస్తే బాగుంటుంది. 



కావలసినవి 

కివి పళ్ళు - 3
నీళ్ళు - 1 కప్పు 

షుగర్ సిరప్ కోసం 

పంచదార - 1 కప్పు
నీళ్ళు - 1/2 కప్పు 
ఉప్పు - చిటికెడు 
ఫుడ్ కలర్ - చిటికెడు (కావాలనుకుంటే)
సిట్రిక్ యాసిడ్ - 1/2 టీ  స్పూన్

తయారుచేసే విధానం

కివి పళ్ళను శుభ్రంగా కడిగి, పై చెక్కు తీసి 
ముక్కలు కట్ చేయాలి. 




 గిన్నెలో 1 కప్పు నీళ్ళు, కివి ముక్కలు వేసి 
5 నిమిషాలు ఉడికించాలి. 



ఉడికిన ముక్కలను పక్కనపెట్టి చల్లారనివ్వాలి. 

చల్లారిన కివి ముక్కల్ని మిక్సీలో వేసి జ్యూస్ చెయ్యాలి. 
ఈ జ్యూస్ ని వడగట్టి పక్కన పెట్టాలి.



అడుగు  మందంగా ఉన్న గిన్నెలో పంచదార వేసి,
పంచదార మునిగేదాకా నీళ్ళు పోయాలి

  5 నిమిషాలు సన్నని మంట మీద కలుపుతూ 
షుగర్ సిరప్ తయారు చెయ్యాలి. 
 

ఈ షుగర్ సిరప్ లో ముందే చేసిపెట్టిన 
కివి జ్యూస్ వేసి కలిపి,బాగా మరిగించాలి . 

ఇందులో సిట్రిక్ యాసిడ్,ఉప్పు,
ఫుడ్ కలర్ వేసి  కలపాలి. 



ఈ మిశ్రమాన్ని  సన్నని మంటమీద ఉంచి కలుపుతూ 
బుడగలు వస్తూ చిక్కగా అయ్యేదాకా  
వుంచి స్టవ్ ఆఫ్ చేయాలి . 

ఇప్పుడు చిక్కగా స్క్వాష్ రెడీ అయినట్లే. 

పూర్తిగా చల్లారిన తర్వాత స్క్వాష్ ని 
శుభ్రమైన జార్ లో పెట్టుకోవాలి . 



తాగాలనుకున్నప్పుడు గ్లాస్ లో సగం 
లేదా రుచిని బట్టి కావలసినంత 
స్క్వాష్ ని తీసుకుని 

ఇందులో సోడా, ఐస్ క్యూబ్స్ వేసుకుని 
కలిపి తాగితే చాలా బాగుంటుంది.



స్క్వాష్ లు మనకిష్టమైన అన్నిరకాల ఫ్రూట్స్ తో చేసుకోవచ్చు. పళ్ళ గుజ్జు,పంచదార ఉపయోగించి చేసే  ఈ ఫ్రూట్ స్క్వాష్ లను ఒకేసారి ఎక్కువగా చేసి,ప్రిజర్వేటివ్స్ (మెటా బై సల్ఫేట్ )కలిపి పెట్టుకుంటే  తాగాలనుకున్నప్పుడు కొంచెం  సోడా కలుపుకుని తాగితే చాలా బాగుంటుంది. వీటిని పార్టీలు,ఫంక్షన్స్ లో "వెల్ కమ్ డ్రింక్"  గా  కూడా అతిధులకి  అందించొచ్చు .. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు