.

.

nani

25, జనవరి 2015, ఆదివారం

బ్రౌన్ రైస్ ఎగ్ దమ్ బిర్యాని / Brown Rice Egg Dum Biryani



బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యము .. ఆరోగ్య కారణాల వలన ప్రస్తుతం బ్రౌన్ రైస్ కి ప్రాముఖ్యత పెరిగింది.తెల్లగా పాలిష్ చేసిన బియ్యంతో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదని, బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్ధం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయని  పోషకాహార నిపుణుల అభిప్రాయం. 

బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని,పీచు సమృద్ధిగా ఉండటం వలన బ్రౌన్ రైస్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలను, రక్తపోటునుతగ్గిస్తుంది. రక్తంలో చక్కరను నియంత్రిస్తుంది. ½ కప్పు బ్రౌన్ రైస్  మూడు కప్పులకు సమానం, కాబట్టి బ్రౌన్ రైస్ తినడం వలన రోజువారీ పోషకాహార అవసరాలు కూడా తీరతాయి. 

ఇంతగా ఉపయోగపడే బ్రౌన్  రైస్ రోజూ మామూలుగా తినలేకపోయినా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి .  




కావలసినవి 
బ్రౌన్ రైస్ - 2 కప్పులు 
కోడిగుడ్లు - 4
టమాటాలు - 1 పెద్దది
ఉల్లిపాయలు  - 2 
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జిలకర పొడి - 1 టీ స్పూన్ 
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్ 
కారం - 1 టీ స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా
గరం మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
పెరుగు - 1/4 కప్పు
పలావు ఆకు (బే లీఫ్ ) - 1 
దాల్చిన చెక్క - 1 చిన్నముక్క 
యాలకులు - 4
లవంగాలు - 4 
కరివేపాకు - 2 రెమ్మలు 
పుదీనా - కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా 
నెయ్యి -  2 టేబుల్ స్పూన్లు 
నూనె - 2 టేబుల్ స్పూన్లు 


తయారుచేసే విధానం 

బ్రౌన్ రైస్ ని శుభ్రంగా కడిగి వండటానికి కనీసం 
8 గంటల ముందు నానబెట్టాలి.



ఒక గిన్నెలో 2 కప్పుల  బియ్యానికి 1/2 లీటర్ నీళ్ళు పోసి, 
ఉడికించి,ఉడికిన అన్నాన్ని జల్లెడతో నీరంతా పోయేలా 
వడగట్టి,పక్కన పెట్టాలి.

 

 ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ,టమాటా 
సన్నగా తరిగి పక్కన పెట్టాలి.

 


కోడిగుడ్లు నీళ్ళలో ఉడికించి,
పొట్టు తీసి పక్కన పెట్టాలి 

కుక్కర్ పెట్టి  నెయ్యి, నూనె వేసి కాగాక 
పలావు ఆకు,దాల్చినచెక్క,లవంగాలు,
యాలకులు వేసి వేయించాలి. 

 

సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
పుదీనా,కరివేపాకు కూడా వేసి వేగాక,

అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 
పచ్చి వాసన పోయేదాకా వేయించాలి

తరిగిన టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. 


ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,టమాటాలు 
మొత్తం బాగా మగ్గిన తర్వాత 

జిలకర పొడి,ధనియాల పొడి, గరం మసాలా పొడి,
కారం,ఉప్పు వేసి బాగా కలపాలి. 


ఇందులో 1/4 కప్పు పెరుగు కూడా వేసి కలపాలి.


ఉడికించి పెట్టిన కోడి గుడ్లను చాకుతో కొంచె గాట్లు పెట్టి,
మగ్గించిన టమాటా కూరలో వేసి బాగా కలిపి,

5 నిమిషాలు వేయించాలి.
 చివరిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి.

 

ఉడికిన టమాటా,కోడిగుడ్ల కూరలో ముందుగా ఉడికించి పెట్టిన
అన్నం కూడా వేసి,పుదీనా,కొత్తిమీర,
నెయ్యిలో  వేయించిన ఉల్లిపాయముక్కలు చల్లాలి

 

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి,
దానిమీద బిర్యానీ ఉన్న కుక్కర్ పెట్టి,
 పైన బరువైన మూత పెట్టి 1/4 గంట సేపు 
సన్నని మంట మీద ఉడికించాలి.


రుచిగా, ఆరోగ్య కరంగా
బ్రౌన్ రైస్ ఎగ్ దమ్ బిర్యాని / Brown Rice Egg Dum Biryani
 తినటానికి రెడీ

 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు