.

.

nani

26, జనవరి 2015, సోమవారం

చిక్కుడుకాయ టమాటా కూర / chikkudukaya tomato curry


చిక్కుడు కాయలు ఇంతకుముందు రోజుల్లో చలికాలంలో మాత్రమే కాసేవి,భోగి పండగ రోజు పులగంతో పాటు, తప్పకుండా చేసుకునే కూర "చిక్కుడు కాయ టమాటా కూర." కానీ ఈ రోజుల్లో ఒక్క జనవరిలోనే కాదు మధ్య మధ్యలో కూడా చిక్కుడు కాయలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. 

మా చిన్నప్పుడు మా అమ్మ ప్రతి సంవత్సరం పెరట్లో వేసే చిక్కుడు పందిరి వేయాల్సిందే అలాగే కొన్నాళ్ళకి పందిరి తీసేసి, గట్టిగా,పెద్దవిగా ఉన్న చిక్కుడు గింజలు ఎండబెట్టి దాచి, మళ్ళీ సీజన్లో అవే గింజలు నాటేవాళ్ళు.
చిక్కుడు గింజలు బాగా ఇష్టపడేవాళ్ళుగుగ్గిళ్ళుగా కూడా చేసుకుని తింటారు.   


 కావలసినవి 

చిక్కుడు కాయలు - 1/4 K.G
టమాటాలు - 2 పెద్దవి 
ఉల్లిపాయ  - 1
పచ్చిమిర్చి - 4 
కొత్తిమీర - కొద్దిగా 
కరివేపాకు - 2 రెమ్మలు 
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1 టీ  స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్ 
నూనె - 2  టేబుల్ స్పూన్లు
ఆవాలు,జీలకర్ర - 1 టీ  స్పూన్



తయారు చేసే విధానం 

చిక్కుడు కాయలు కొసలు గిల్లి,పీచు తీసేస్తూ 
చేత్తోనే ముక్కలుగా చేయాలి. 

కొద్దిగా నీళ్ళలో ఉప్పు వేసి చిక్కుడుకాయ ముక్కలు 
వేసి ఉడికించి పక్కన పెట్టాలి. 

టమాటా,ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలుగా తరగాలి.
బాండీలో నూనె వేసి కాగాక  ఆవాలు,జిలకర వేసి 
చిటపటలాడిన తర్వాత 

తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు,
పసుపు,ఉప్పు వరుసగా వేస్తూ వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 
పచ్చివాసన పోయేదాకా వేయించాలి. 

ఇప్పుడు ఈ తాలింపు లో టమాటా ముక్కలు వేసి,
బాగా కలిపి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 

మగ్గిన టమాటాల్లో కారం వేసి కలిపి 
2 నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టిన 
చిక్కుడు కాయ ముక్కలు  వేసి కలిపి,

మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించి
చివరిగా కొత్తిమీర చల్లాలి. 

 రుచిగా  చిక్కుడుకాయ టమాటా కూర రెడీ
ఈ కూర అన్నంలో,చపాతీలో బాగుంటుంది.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు