.

.

nani

31, మార్చి 2015, మంగళవారం

పాలక్ పనీర్ - 2 / palak paneer

నార్త్ ఇండియన్స్ ఫేమస్ పాలక్  పనీర్.. మన వంటల్లో కూడా భాగంగా కలిసిపోయిందని చెప్పొచ్చు. పాలక్ పనీర్ తెలియని వాళ్ళు ఉండరేమో.. ఏ రెస్టారెంట్స్ అయినా దాభాల్లో అయినా మెనూ కార్డ్ లో వెజ్ ప్రియులు ఎంచుకునే డిష్ ల్లో "పనీర్ బటర్ మసాలా","పాలక్ పనీర్" తప్పకుండా ఉంటాయి.రుచి కోసమే కాదు,పాలకూరలో ఐరన్,పనీర్ లోని ప్రోటీన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

పాలకూర ప్యూరీతో కాకుండా,సన్నగా తరిగిన పాలకూరతో చేసిన "పాలక్ పనీర్"  ఈ లింక్ లో చూడొచ్చు.. 
http://nani-kitchen.blogspot.in/2014/10/palak-paneer.html 


కావలసినవి
పాలక్ ప్యూరీ కోసం

పాలకూర - 2 కట్టలు 
ఉల్లిపాయ ముక్కలు  - 1/2 కప్పు 
పచ్చిమిర్చి - 3
పుదీనా - కొద్దిగా  


 కూర కోసం 

  పనీర్ - 200 గ్రామ్స్ Pack 
 పాలు - 1/2 కప్పు 
దాల్చినచెక్క - చిన్నముక్క 
లవంగాలు - 2
ఇలాచి - 1
కారం - 1/4 టీ స్పూన్ 
మిరియాలపొడి - 1/4 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
 ధనియాలపొడి - 1/4 టీ స్పూన్ 
అల్లం,వెల్లుల్లిపేస్ట్ - 1 టీ స్పూన్ 
నూనె - 1 టేబుల్ స్పూన్ 
సన్నగా తరిగిన కొత్తిమీర,కరివేపాకు  - కొద్దిగా 




తయారుచేసే విధానం 

ఒక గిన్నెలో ఆకు మునిగేంత నీళ్ళు పోసి మరిగాక,
శుభ్రంగా కడిగి,తరిగిన పాలకూర,పచ్చిమిర్చి,
ఉల్లిపాయముక్కలు,పుదీనా వేసి 
అన్నీ మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. 

ఇప్పుడు వీటిని నీళ్ళలో నుండి వడకట్టి మిక్సీలో వేసి 
మెత్తగా ప్యూరీ చేయాలి. 

ఇది మామూలుగా పాలక్ ప్యూరీ చేసే విధానం. 
కానీ ఇలా ఆకుకూర ఉడికించిన నీళ్ళు వడకట్టటం వలన 
పాలకూరలో ఉన్న పోషకవిలువలు కోల్పోతాయని 
కొందరి ఆరోగ్యప్రియుల ఆందోళన.. 

అందుకే అలా కాకుండా మైక్రోవేవ్ వోవెన్లో చేస్తే 
కొద్దిగా నీటితోనే పాలకూర మగ్గిపోతుంది కాబట్టి 
ఆ భయం అవసరంలేదు. 

వోవెన్ లో పాలక్ ప్యూరీ

శుభ్రంగా కడిగి,తరిగిన పాలకూర,ఉల్లిపాయ,
పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా,1/4 కప్పు నీళ్ళు అన్నిటినీ
ఒక మైక్రో వేవ్ సేఫ్ బౌల్ లో వేసి మూతపెట్టాలి. 

ఈ బౌల్ ని ఓవెన్లో పెట్టి,5 నిమిషాలు టైం సెట్ చేసి 
ఉడికించాలి.



ఉడికిన పాలకూర మిశ్రమాన్ని మిక్సీ జార్లో 
గ్రైండ్ చేసి, పాలక్ ప్యూరీ తయారు చేయాలి. 



బాండీలో నూనె వేసి కాగాక,దాల్చిన చెక్క,లవంగాలు,
ఇలాచి వేసి,కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన 
1/2 కప్పు ఉల్లిపాయముక్కలు,కరివేపాకు వేసి వేయించాలి.


వేగిన ఉల్లిపాయల్లో అల్లంవేల్లుల్లిపెస్ట్ కూడా వేసి,
పచ్చివాసన పోయేదాకా వేయించాలి. 

 ఇప్పుడు ఇందులో ముందుగా చేసిపెట్టిన 
పాలక్ ప్యూరీ వేసి కలపాలి. 


పాలక్ ప్యూరీ ఉడికి దగ్గరపడిన తర్వాత
ఉప్పు,కారం,ధనియాలపొడి వేసి కలపాలి. 
ఇందులో కాచి,చల్లార్చిన పాలు పోయాలి. 

వేడినీళ్ళలో వేసి ఉంచిన పనీర్ ముక్కల్ని 
నీళ్ళు లేకుండా పిండి, ఉడుకుతున్న పాలక్ ప్యూరీలో వెయ్యాలి

2 నిమిషాలు మగ్గిన తర్వాత,మిరియాలపొడి,
 సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. 



టేస్టీగా పాలక్  పనీర్ రెడీ..  రోటీ,చపాతీ,పూరీల్లోకి 
చాలా బాగుంటుంది.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు