.

.

nani

8, మార్చి 2015, ఆదివారం

ఎగ్ లెస్ చాక్లెట్ మఫిన్స్ / Egg less Chocolate Muffins


మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 






కావలసినవి 

మైదా - 1 కప్పు 
Cocoa (కోకో) పౌడర్  - 1/4 కప్పు  
చాక్లెట్ చిప్స్ - 1/4 కప్పు 
పంచదార - 3/4 (ముప్పావు) కప్పు
పెరుగు - 1/2 కప్పు 

వెనిల్లా ఎసెన్స్ - 1 టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - 1/2 టీ స్పూన్ 
బేకింగ్ సోడా - 1/4 టీ స్పూన్ 
నూనె - 1/4 కప్పు 

తయారు చేసే విధానం

కేక్ మిక్సింగ్ బౌల్ లో ముందుగా 
పంచదార వేయాలి. 

పంచదారలో పెరుగు వేసి కలపాలి
ఎగ్ లెస్ మఫిన్స్ కాబట్టి కోడిగుడ్ల బదులు 
పెరుగు ఉపయోగించాలి. 

ఎగ్ తినే వాళ్ళు పెరుగు బదులు ఎగ్స్ వాడొచ్చు.

 

పంచదార,పెరుగు బాగా కలిసేలా బీటర్ తో కలిపి,
ఇందులో వెనిల్లా ఎసెన్స్ కూడా వేసి కలపాలి.


కలిపిన పంచదార,పెరుగు,వెనిల్ల ఎసెన్స్ మిశ్రమంలో 
బేకింగ్ పౌడర్,బేకింగ్ సోడా రెండూ వేసి  కలపాలి 


ఇందులో 1/4 కప్పు నూనె కూడా వేసి 
అంతా కలిసేలా బీట్ చేసి పక్కన పెట్టాలి.



ఒక జల్లెడలో మైదా,Cocoa (కోకో)  పౌడర్ వేసి 
రెండూ బాగా కలిసేలా  జల్లించాలి.



జల్లించిన మైదా, Cocoa (కోకో) పౌడర్ ని
ముందుగా కలిపి పెట్టిన పంచదార,పెరుగు 
మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ కేక్ మిశ్రమం తయారు చేయాలి.




చాక్లెట్ చిప్స్ ని కొంచెం మైదా పిండి చల్లి 
డస్టింగ్ చెయ్యాలి.

ఇలా డస్టింగ్ చేయకపోతే చాక్లెట్ చిప్స్ అన్నీ 
మఫిన్స్ అడుగుకి వెళ్ళిపోయి,కరిగి మాడిపోతాయి.




ఇప్పుడు  డస్టింగ్ చేసిన చాక్లెట్ చిప్స్ ని కూడా 
కేక్  మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
cake mix తయారయింది 


కేక్ మౌల్డ్స్ ఇంతకుముందు అల్యూమినియం వి వాడేవాళ్ళు. 
వాటికి బటర్ రాయటం, మైదా తో డస్టింగ్ చేయటం 
కొంచెం కష్టంగా అనిపించేది. 

ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా సిలికాన్ మౌల్డ్స్
ఉపయోగిస్తున్నారు.

సిలికాన్ మౌల్డ్స్  లో డస్టింగ్ తో అవసరం లేకుండా 
డైరెక్ట్ గా కేక్ మిశ్రమం వేసి ఓవెన్ లో పెట్టొచ్చు. 

ఉడికిన తర్వాత తీయటం కూడా సులభంగా ఉంటుంది. 
 శుభ్రం చేయటం కూడా ఈజీనే


కలిపిన కేక్  మిశ్రమాన్ని మౌల్డ్స్ లో 3/4 వరకే  పోసి,
పైన కొద్దిగా డస్టింగ్ చేసిన చాక్లెట్ చిప్స్ వేయాలి.


ముందుగానే ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 170 °C లో 
20 --30 నిమిషాలు బేక్ చేయాలి.


హాట్ & స్వీట్ గా  చాక్లెట్ చిప్స్ తో  
ఎగ్ లెస్ చాక్లెట్ మఫిన్స్ రెడీ. 


చాక్లెట్ తో చేశాము కాబట్టి పిల్లలకి చాలా నచ్చుతాయి


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు