.

.

nani

7, మార్చి 2015, శనివారం

గుంటూరు మిర్చిబజ్జి/ Guntur Mirchi Bajji

మిర్చిబజ్జి(మిరపకాయ బజ్జి) తెలియని వాళ్ళు,ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. ఎంత ఘాటుగా మంట నషాళానికి అంటుతున్నా,మిరపకాయతో కలిపి తింటేనే మా గుంటూరు మిర్చిబజ్జి తిన్నట్టు లెక్క.. 

 
కావలసినవి 

బజ్జీ మిరపకాయలు - 10
శనగపిండి - 1 కప్పు 
బియ్యప్పిండి - 1 టేబుల్ స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
వాము - 1 టేబుల్ స్పూన్ 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

 
తయారుచేసే విధానం

వాము,ఉప్పు కలిపి రోటిలో మెత్తగా 
దంచి పక్కన పెట్టాలి. 



తొడిమలు తీయకుండానే మిర్చిని  శుభ్రంగా కడిగి,
కడిగిన మిర్చికి  సన్నగా చీలికలు పెట్టాలి.



మిరపకాయలలో ఎక్కువ గింజలు ఉంటే చీలికలు పెట్టినప్పుడు 
తీసేస్తే కారం మరీ ఘాటుగా లేకుండా ఉంటుంది.

చీలికలు పెట్టిన మిరపకాయల్లో ముందుగా 
దంచి పెట్టిన వాము,ఉప్పు నింపాలి. 


శనగపిండి,బియ్యప్పిండి,ఉప్పు,1 టీ  స్పూన్ వాము
తగినన్ని నీళ్ళు పోసి  బజ్జీ పిండి కలపాలి  

 వాము,ఉప్పు పొడి నింపి పెట్టిన మిరపకాయలను 
పిండిలో ముంచి,పిండి అంటేలా కలిపి 



బాగా కాగిన నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ 
వచ్చేదాకా వేయించాలి. 
   రుచిగా మిర్చి బజ్జీ రెడీ 



మసాలా బజ్జీ కోసం 


వేగిన మిర్చి బజ్జీని మధ్యకి కట్ చేసి 
సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర ,ఉల్లిపాయలను
స్టఫ్ చేసి,నిమ్మరసం పిండితే 
 మసాలా బజ్జీ  తయారయినట్లే.. 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు