.

.

nani

28, మార్చి 2015, శనివారం

బ్రౌన్ రైస్ పచ్చిమామిడికాయ పులిహోర / Raw Mango Rice with Brown Rice


"బ్రౌన్ రైస్ తో పచ్చిమామిడికాయ పులిహోర" టేస్ట్ లో ఏ మాత్రం తేడా లేకుండా మామూలు రైస్ తో చేసిన పులిహోర లాగానే ఉంది.పైగా ఆరోగ్యం కోసం ఆలోచించే వాళ్లకి(Health Conscious)చాలా మంచిది.. 



కావలసినవి 

బ్రౌన్ రైస్ - 1 కప్పు
మామిడికాయ తురుము - 1 కాయ

తాలింపు కోసం 

నూనె - 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు ( వేరుశనగ గింజలు ) -2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 15
పచ్చిపప్పు -కొన్ని 
ఆవాలు,జిలకర - కొన్ని 
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 2 
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - 1 /2 టీ స్పూన్


తయారు చేసే విధానం 


రెండుగంటలు ముందుగా నాన బెట్టిన  బ్రౌన్ రైస్ ని 
1 కప్పుకి 2 1/2 కప్పుల కొలత నీళ్ళతో,కొంచెం ఉప్పు కలిపి,
కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టాలి.



పచ్చి మామిడికాయ చెక్కు తీసి 
తురుమి పక్కన పెట్టాలి 


బాండీలో నూనె వేసి కాగాక ఆవాలు,జిలకర వేసి వేగిన తర్వాత,
పచ్చిపప్పు,పల్లీలు ( వేరుశనగ గింజలు ),
జీడిపప్పు,పచ్చిమిర్చి,ఎండుమిర్చి,
కరివేపాకు,ఇంగువ వరసగా వేస్తూ వేయించాలి.

వేగిన తాలింపులో పసుపు,ఉప్పు వేసి కలిపి
చివరిగా మామిడి తురుము కూడా వేసి కలపాలి.


తయారైన తాలింపులో ముందుగా వండిపెట్టిన 
బ్రౌన్ రైస్ వేసి,బాగా కలిపితే 
"బ్రౌన్ రైస్ పచ్చిమామిడికాయ పులిహోర" రెడీ

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు