.

.

nani

12, మార్చి 2015, గురువారం

సొరకాయ హల్వా / Sorakaya Halwa


సొరకాయతో  పప్పు,పులుసు ఎంత ఫేమస్సో ,సొరకాయ హల్వా కూడా 
అంతే ఫేమస్.స్వీట్ ఇష్టపడే వాళ్లకి ఈ హల్వా  తప్పకుండా నచ్చుతుంది.


కావలసినవి 

లేత సొరకాయ తురుము - 3 కప్పులు
పంచదార - 1 కప్పు
మిల్క్ మెయిడ్ - 1/2 కప్పు 
నెయ్యి - 1/2  కప్పు 
జీడిపప్పు - 10
బాదం - 10 
పాలు -2 కప్పులు 
యాలకుల పొడి - 1 టీ స్పూన్ 
గ్రీన్ ఫుడ్ కలర్ - చిటికెడు


 తయారుచేసే విధానం 

సొరకాయని చెక్కు తీసి సన్నగా తురమాలి.


బాండీలో నెయ్యి వేసి వేడయ్యాక 
జీడిపప్పు,బాదం ముక్కలు కిస్మిస్ వేసి 
దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి.



అదే నెయ్యిలో సొరకాయ తురుము కూడా వేసి 
బాగా కలిపి మగ్గించాలి.


 మగ్గిన సొరకాయ తురుములో 
పాలు పోసి కలపాలి.  


తర్వాత  మిల్క్ మెయిడ్,పంచదార 
కూడా వేసి కలపాలి. 
 
 

 పాలు,మిల్క్ మెయిడ్,పంచదార కలిపిన 
సొరకాయ తురుము  బాగా ఉడికి,
నీరంతా ఇంకిపోయ్యేదాకా 
సన్నటి మంట మీద ఉడికించాలి


 హల్వా ఉడికి దగ్గర పడ్డాక నీళ్ళలో కలిపిన 
ఫుడ్ కలర్ కలిపి ఇంకాసేపు ఉడికించాలి.
(ఫుడ్ కలర్ నచ్చని వాళ్ళు వేయకుండానే చేసుకోవచ్చు )



 చివరగా యాలకుల పొడి,1 టేబుల్ స్పూన్ నెయ్యి,
ముందుగానే వేయించి పక్కన పెట్టిన
 జీడిపప్పు,బాదం ముక్కలు కిస్మిస్ వేసి బాగా కలిపితే 
నోరూరించే సొరకాయ హల్వా రెడీ 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు