.

.

nani

28, మార్చి 2015, శనివారం

స్వీట్ కార్న్ కోసాంబరి / Sweet Corn Kosambari (Salad)

కోసాంబరిలో  మనకి ఇష్టమైన చాలా రకాలు చేసుకోవచ్చు.
అందులో ఒకటి "స్వీట్ కార్న్ కోసాంబరి"



కావలసినవి 

ఉడికించిన స్వీట్ కార్న్ -1/2 కప్పు
కొబ్బరి తురుము - 1/4 కప్పు 
క్యారట్ తురుము - 1/2 కప్పు 
పచ్చి మామిడికాయ ముక్కలు - 1/4 కప్పు 
నిమ్మకాయ - 1/2 చెక్క 
ఉప్పు - రుచికి సరిపడా 

తాలింపు కోసం

నూనె - 1 టీ స్పూన్ 
ఆవాలు - కొంచెం 
ఇంగువ - చిటికెడు 
పచ్చిమిర్చి - కొన్ని ముక్కలు


 ఒక బౌల్ లో ఉడికించిన స్వీట్ కార్న్,పచ్చికొబ్బరి తురుము
 తురిమిన క్యారట్,పచ్చిమామిడికాయ ముక్కలు 
 వేసి కలపాలి. 


ఇందులో 1/2 చెక్క నిమ్మరసం పిండి 
బాగా కలపాలి 



ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి 
వేగాక,స్టఫ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ,పచ్చిమిర్చి వేసి
కలిపితే తాలింపు రెడీ అయినట్లు.. 



ఈ తాలింపుని కలిపి పెట్టిన స్వీట్ కార్న్ మిశ్రమంలో 
వేసి, అంతా  కలిసేలా కలపాలి. 

చివరిగా సరిపడినంత ఉప్పు కలిపితే 
కోసాంబరి రెడీ అయినట్లే

(ఉప్పు ముందుగానే కలిపితే ముక్కలకి ఉప్పు పట్టేసి, 
నీరవుతుంది. అందుకే ఉప్పు చివర్లో కలపాలి.) 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు