.

.

nani

5, ఏప్రిల్ 2015, ఆదివారం

కీమా సమోసా / Keema Samosa


సమోసా అందరూ ఇష్టపడేవే కానీ సమోసాలో ఫిల్లింగ్ మార్చేసి కీమా తో చేస్తే నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడే  కీమా సమోసా ఇవాల్టి సండే స్పెషల్.. 


కావలసినవి 

సమోసా పట్టీలు (Sheets )- 25
కీమా - 1/ 4 k.g
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్
ఉప్పు -  రుచికి సరిపడా
కారం - 1/2 టీ స్పూన్
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా 
సమోసా చివర్లు అంటించటానికి 
2 టేబుల్ స్పూన్ల మైదాలో నీళ్ళు కలిపి చేసిన పేస్ట్



తయారుచేసే విధానం

మైదాతో పల్చగా చపాతీ చేసి ఆ చపాతీతో సమోసాలు చేస్తుంటాము. 
కానీ ఆ  చపాతీ అందరికీ సరిగ్గా చేయటం రాదు. 
ఒక్కోసారి చాలా మందంగా వచ్చి,వేగకుండా పచ్చిగా ఉంటాయి. 

అలా ఇబ్బంది పడే వాళ్ళకోసం 
సమోసా పట్టీలు (sheets )మార్కెట్లో రెడీ మేడ్ గా దొరుకుతాయి.
వీటితో సమోసాలు కూడా ఈజీగా,తక్కువ టైం లో చేసుకోవచ్చు. 



కీమాని శుభ్రంగా కడిగి,పసుపు,ఉప్పు,కారం వేసి 
నీరు లేకుండా ఉడికించి పెట్టాలి. 

ఒక గిన్నెలో ఉడికించిన కీమా, సన్నగా తరిగిన 
పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,కరివేపాకు,కొత్తిమీర, 
ఉప్పు,గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి



 తయారుచేసి పెట్టిన కీమా మిశ్రమాన్ని 
సమోసా పట్టీలలో పెట్టి,సమోసాలను మడిచి, 
నీళ్ళు కలిపిన మైదాతో అంచులు అతికించాలి.


అన్ని సమోసా పట్టీలలో ఇలాగే కీమా నింపి 
సమోసాలు తయారుచేసి పెట్టాలి 



బాండీలో డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసి కాగాక 
ముందుగా తయారుచేసి పెట్టిన సమోసాలు వేసి 
మీడియం  మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి.


టేస్టీ & ఈజీ కీమా సమోసా రెడీ 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు