.

.

nani

1, ఏప్రిల్ 2015, బుధవారం

రాజ్మా పరాటా / Rajma (kidney beans Paratha)

ప్రపంచమంతా రకరకాల వంటల్లో ఉపయోగించే రాజ్మా / కిడ్నీ బీన్స్.  రైస్,కర్రీస్,సలాడ్స్ లో వీటిని ఉపయోగిస్తారు. రాజ్మా పూర్తి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.శరీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

వీటిలో ఎక్కువగా ఉండే ఐరన్  (high amount of iron) శరీరానికి 
కావాల్సిన ఎనర్జీ ని పెంపొందిస్తుంది. దీనిలోని ఫైబర్ (పీచు పదార్ధం) , డయాబెటిస్ ని నియంత్రిస్తుంది.

పొటాషియం,మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ సామాన్యస్థాయిలో ఉండేలా చేస్తుంది.  blood vessels లో రక్తం గడ్డ కట్టకుండా smooth blood flow తో గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

తక్కువ కాలరీలను కలిగి ఉండే రాజ్మా అన్నివయసుల వాళ్ళు, డైటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా సలాడ్ ,సూప్ ల రూపంలో తీసుకోవచ్చు. 

విటమిన్ B పుష్కలంగా ఉన్న రాజ్మా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.జీర్ణవ్యవస్థని క్రమబద్ధం చేస్తుంది. 

రాజ్మా పరాటా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కానీ,మధ్యానం లంచ్ లో కానీ తినొచ్చు,రుచిగా ఉండే మంచి పోషకాహారం,పిల్లలు కూడా ఇష్టపడి తినే ఈ రాజ్మా పరాటా నానీ కిచెన్ లో .. 
కావలసినవి 

పరాటా  కోసం 

గోధుమపిండి  - 2 కప్పులు
ఉప్పు  - కొద్దిగా 
నూనె - 1 టీ స్పూన్ 

పరాటా ఫిల్లింగ్ కోసం
 
రాజ్మా/Rajma   - 1 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1/4 టీ స్పూన్ 
పసుపు - చిటికెడు
గరం మసాలా - 1 టీ స్పూన్ 
ధనియాలపొడి - 1 టీ స్పూన్ 
జిలకర - 1/4 టీ స్పూన్
 నూనె - 1 టేబుల్ స్పూన్ 
పుదీనా,కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా


తయారు చేసే విధానం 

రాజ్మా గింజల్ని ఉదయాన్నే వండాలనుకుంటే 
ముందురోజు రాత్రంతా నానబెట్టాలి. 

 (సుమారు 6-7 గంటలు నానబెడితే మెత్తగా అవుతాయి.)

గోధుమ పిండిలో ఉప్పు,కొంచెం నూనె,తగినన్ని నీళ్ళు పోసి
చపాతీపిండి కలిపి పక్కన పెట్టాలి. 
పరాటా చేయటానికి కనీసం 20 నిమిషాలు ముందు 
చపాతీపిండి తయారుచేసి పెట్టాలి.


  
నానిన రాజ్మాని కుక్కర్లో సరిపడినన్ని నీళ్ళు పోసి,
కొంచెం ఉప్పు వేసి,5 విజిల్స్ వచ్చేదాకా(గింజలు మెత్తగా ఉడికేదాకా)
ఉడికించి,చలారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి.

ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,పుదీనా,కరివేపాకు,కొత్తిమీర 
అన్నిటినీ సన్నగా తరిగి పెట్టాలి.

బాండీలో నూనె వేసి కాగాక జిలకర వేసి వేగనివ్వాలి. 
 సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,పుదీనా,కరివేపాకు,
 వేసి,వేగాక గ్రైండ్ చేసి పెట్టిన రాజ్మా ని వేసి బాగా కలపాలి. 

 ఇందులో కారం,ఉప్పు,పసుపు,ధనియాలపొడి,
వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. 

చివరిగా గరంమసాలా,సన్నగా తరిగిన కొత్తిమీర 
కలిపి ఒక 2 నిమిషాలు వేయించి,స్టవ్ ఆఫ్ చేయాలి.

(రాజ్మా ముందే ఉడికించాము కాబట్టి,ఎక్కువసేపు 
వేయించాల్సిన అవసరం ఉండదు)
 


వేయించిన రాజ్మా మిశ్రమాన్ని 
నిమ్మకాయంత ఉండలు చేసి పెట్టాలి. 

ముందే కలిపిన చపాతీ పిండిని కూడా రాజ్మా మిశ్రమంతో 
సమానంగా ఉండలు చేసి పెట్టాలి.
 చపాతీ పిండిని చేత్తో కొంచెం వెడల్పుగా చేసి రాజ్మా మిశ్రమాన్ని 
మధ్యలో ఉంచి కవర్ చేసి చపాతీ కర్రతో చపాతీ వత్తాలి. 

అన్ని చపాతీలను అలాగే చేసి పెట్టాలి
వేడిచేసిన పెనం మీద నూనె వేసి,తయారు చేసిపెట్టిన 
పరాటాలను రెండువైపులా వేయిస్తే "రాజ్మా పరాటా" రెడీ.
పరాటాలో స్పైసీ స్టఫింగ్ ఉంది కాబట్టి, 
వేరే కర్రీస్ అవసరం ఉండదు. 

 వేగిన పరాటా మీద బటర్ కానీ నెయ్యి కానీ రాసి,
 రైతా లేదా పెరుగు తో తింటే చాలా బాగుంటాయి.. 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు