.

.

nani

1, మే 2015, శుక్రవారం

చికెన్ స్ప్రింగ్ రోల్స్ / Chicken Spring Rolls

స్ప్రింగ్ రోల్స్ చిన్నపిల్లలు, ఇప్పటి యంగ్ జనరేషన్ ఇష్టంగా తినే చైనీస్ స్నాక్.మైదా తో చాలా పల్చని చపాతీల్లాగా చేసి,వాటిలో మనకిష్టమైన వెజిటెబుల్స్,లేదా చికెన్ తో ఫిల్లింగ్ చేసి వాటిని నూనెలో డీప్ ఫ్రై చేస్తే స్ప్రింగ్ రోల్స్ రెడీ. స్ప్రింగ్ రోల్స్ కి కావాల్సిన పల్చని చపాతీ (Spring Roll Sheets)  చేయటమే ఈ వంటలో అన్నిటికంటే  కష్టం,ఆలస్యం. 
అవి రెడీ గా వుంటే  స్ప్రింగ్ రోల్స్ ఈజీగా చేసుకోవచ్చు.రెడీమేడ్ గా దొరికే Spring Roll Sheets తో నేను చేసిన ఈ  చికెన్ స్ప్రింగ్ రోల్స్ చాలా బాగున్నాయి.



 కావలసినవి 

చికెన్ ఫిల్లింగ్ కోసం

 బోన్ లెస్ చికెన్ - 1/4 k.g 
క్యారట్ తరుగు  - 1/4 కప్పు 
 ఉల్లిపాయముక్కలు - 1/4 కప్పు 
క్యాబేజీ - 1/4 కప్పు 
క్యాప్సికమ్ - కొద్దిగా 
స్ప్రింగ్ ఆనియన్స్ - కొద్దిగా 
పచ్చిమిర్చిముక్కలు  - కొద్దిగా 
కరివేపాకు,కొత్తిమీర,పుదీనా - కొంచెం 
 పసుపు - 1 టీ స్పూన్ 
కారం - 1 టీ స్పూన్ 
ఉప్పు - రుచికి సరిపడా 
ధనియాల పొడి - 1/2 టీ స్పూన్ 
గరం మసాలా పొడి - 1/2 టీ స్పూన్ 
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1/2 టీ స్పూన్ 
పెరుగు - 1  టీ స్పూన్ 
కార్న్ ఫ్లోర్ - టేబుల్ స్పూన్ 
టమాటా సాస్ - టీ స్పూన్
సోయా సాస్ - టీ స్పూన్
వెనిగర్ - టీ స్పూన్ 
నూనె - చికెన్ ఫిల్లింగ్ ఫ్రై చేయటానికి ,డీప్ ఫ్రై కి సరిపడా

 స్ప్రింగ్ రోల్ షీట్స్ - 10



తయారుచేసే విధానం
క్యారట్,ఉల్లిపాయ,క్యాబేజీ,క్యాప్సికమ్,
స్ప్రింగ్ ఆనియన్స్,పచ్చిమిర్చి, 
కరివేపాకు,కొత్తిమీర,పుదీనాలను సన్నగా తరిగి పెట్టాలి. 



బోన్ లెస్ చికెన్ ని చిన్న ముక్కలు కట్ చేసి,
పసుపు,కారం,పెరుగు,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరం మసాలా 
వేసి కలిపి 1/2 గంట మారినేట్ చేసి పెట్టాలి.



1/2 గంట మారినేట్ చేసి పెట్టిన చికెన్ లో 
కార్న్ ఫ్లోర్ వేసి చికెన్ అంతా పట్టేలా కలపాలి.



మారినేట్ చేసి,కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టిన చికెన్ ముక్కలని 
నూనెలో డీప్  ఫ్రై చేసి పక్కన పెట్టాలి.



బాండీలో కొద్దిగా నూనె వేసి కాగాక
సన్నగా తరిగిన క్యారట్,ఉల్లిపాయ,క్యాబేజీ,క్యాప్సికమ్,
స్ప్రింగ్ ఆనియన్స్,పచ్చిమిర్చి, కరివేపాకు,పుదీనాలను 
వరసగా వేసి మరీ ఎక్కువగా వేగకుండా పచ్చిగానే ఫ్రై చేస్తూ .. 

సోయా సాస్,టమాటా సాస్,వెనిగర్ వేసి కలపాలి. 
ఇందులో ఉప్పు,కారం,ధనియాలపొడి ,గరం మసాలా పొడి ,
వేసి బాగా కలపాలి.

ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కలు కూడా 
వేసి కలిపి,చివరిగా కొత్తిమీర,పుదీనా,కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్
వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ ఫిల్లింగ్ రెడీ.  



తయారయిన చికెన్ ఫిల్లింగ్



ఇప్పుడు  స్ప్రింగ్ రోల్స్ షీట్స్ లో 
చికెన్ ఫిల్లింగ్ నింపాలి.




తగినంత ఫిల్లింగ్ పెట్టి ఈ ఫోటోలలో చూపించినట్లు 
మడుస్తూ, అంచులని  నీళ్ళలో కలిపిన మైదాతో అతికించి,
స్ప్రింగ్ రోల్స్ తయారుచేయాలి.





తయారుచేసి పెట్టిన స్ప్రింగ్ రోల్స్ ని 
కాగిన నూనెలో మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ లో 
 డీప్ ఫ్రై చేయాలి.



క్రిస్పీ & స్పైసీ "చికెన్ స్ప్రింగ్ రోల్స్" రెడీ . 
టమాటా సాస్ తో తింటే చాలా బాగుంటాయి.


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు