.

.

nani

18, మే 2015, సోమవారం

స్వీట్ మ్యాంగో చట్నీ / Gujarati Sweet Mango Pickle / Aam ka Chundo

పుల్లటి మామిడికాయ తో కారం ఆవకాయే కాదు స్వీట్ చట్నీ కూడా చేయొచ్చు. "Aam ka Chundo" గుజరాతీల పచ్చళ్ళన్నిటిలో ఫేమస్.. గుజరాతీలు తినే "Thelpas" తో "స్వీట్ మ్యాంగో చట్నీ" తప్పకుండా ఉండే కాంబినేషన్. చట్నీ తియ్యగా, పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడి తింటారు..ఈ రెసిపీ మాకు తెలిసిన గుజరాతీ " Art Of Living " టీచర్ ఒకరు చెప్పారు.. 



కావలసినవి 

పుల్లటి పచ్చిమామిడి కాయ తురుము - 3 కప్పులు
పంచదార - 3 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
 పసుపు - 1/4 టీ స్పూన్
కారం - 2 టీ స్పూన్లు
జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు


తయారుచేసే విధానం

పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగి,
చెక్కు తీయాలి.


చెక్కు తీసిన మామిడికాయల్ని 
తురమాలి.


ఒక గిన్నెలో మామిడికాయ తురుము, 
పసుపు,ఉప్పు వేసి కలిపి,
 1/2 గంట పక్కన ఉంచేస్తే నీరు ఊరుతుంది.


ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసి,
బాగా కలిసేలా కలపాలి.


అడుగు మందంగా ఉన్న బాండీని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక,
ఉప్పు,పసుపు,పంచదార కలిపిన మామిడి తురుము మిశ్రమాన్ని
వేసి ,పంచదార పూర్తిగా కరిగేదాకా కలుపుతూ ఉడికించాలి.


 ఇందులో మిగిలిన 2 కప్పుల పంచదార 
కూడా వేసి, కలుపుతూ ఉడికించాలి.


పంచదార గడ్డలు కట్టి ,గులకలు (crystallize) తయారవకుండా 
కలుపుతూ పంచదార అంతా  బాగా కరిగి,పొంగులాగా 
వచ్చేదాకా మీడియం మంట మీద కలుపుతూ ఉడికించాలి. 


పంచదార అంతా  కరిగి తీగపాకం వచ్చేదాకా 
ఉడికించి,స్టవ్ ఆఫ్ చేసి,పంచదార గడ్డకుండా
అప్పుడప్పుడు కలుపుతూ చల్లారనివ్వాలి.


మామిడితురుము మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత
కారం,జీలకర్ర పొడి వేసి, అంతా కలిసేలా బాగా కలపాలి.


తియ్యగా పుల్లగా 
స్వీట్ మ్యాంగో చట్నీ / Gujarati Sweet Mango Pickle
రెడీ ..



ఈ స్వీట్ మ్యాంగో చట్నీ వెంటనే తినేయొచ్చు,

శుభ్రమైన గాజు జాడీలో పెట్టి ఉంచితే ఫ్రిజ్ లో ఉంచకపోయినా 
1 సంవత్సరం నిల్వ వుంటుంది.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు