.

.

nani

19, మే 2015, మంగళవారం

మామిడిఅల్లం నిల్వ పచ్చడి / Mango Ginger Pickle

"మామిడి అల్లం"  మామిడి సువాసనతో ఉండి, చూడటానికి మనం వాడే  అల్లం లాగానే ఉంటుంది.ఆరోగ్యానికి చాలా మంచిది.. పైత్యాన్ని తగ్గిస్తుంది. ఔషద పరంగా మంచి ఉపయోగాలు వున్న ఈ మామిడి అల్లం మార్కెట్ లో దొరుకుతుంది.. ఈ పచ్చడిని బామ్మల కాలం నుండి  చేసే పధ్ధతి లో  జాగ్రత్తగా చేస్తే సంవత్సరం అంతా  నిల్వ వుండి,ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ లో, అన్నం లో  చాలా బాగుంటుంది. 

మా ఇంట్లో అందరికీ  ఇష్టమైన ఈ పచ్చడి పెట్టగానే  తిని,మా అబ్బాయి చిన్నప్పుడు సమ్మర్ లో ఒక్క పూట బడి కి వెళ్ళేటప్పుడు బాక్స్ లో  దిబ్బరొట్టె తో ఈ అల్లం పచ్చడి వేసి పెట్టే దానివమ్మా..నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇష్టంగా తినే వాళ్ళు.ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి  అన్నాడు.నాకు చాలా సంతోషంగా అనిపించింది.

అల్లం పచ్చడి చాలా రకాలుగా  పెడతారు .. ఇది నేను చేసే పద్ధతి. 




 కావలసినవి 

మామిడి అల్లం - 1 k.g 
చింతపండు - 1/4 k.g 
కారం - 2 గిద్దలు 
ఉప్పు - 2 గిద్దలు 
ఆవాలు - 100 గ్రాములు 
మెంతులు - 25 గ్రాములు 
వెల్లుల్లిపాయలు - 100 గ్రాములు 
బెల్లం - 1/4 k.g 
నీళ్ళు - 1/2 లీటర్ 

తయారు చేసే పధ్ధతి 

మామిడి అల్లాన్నిశుభ్రంగా కడిగి చెక్కు  తీసి, 
సన్నని ముక్కలు  చేసి పెట్టుకోవాలి. 



 గింజలు లేని చింతపండును  తీసుకుని,  1/2 లీటర్ నీళ్ళను 
మరిగించి  చింత పండు వేసి చిక్కబడే  వరకు ఉడికించాలి. 



  చల్లారిన తర్వాత ఉడికించిన చింతపండుని 
గుజ్జులాగా చేసి, అందులో పిప్పి తీసేయాలి

గ్రైండర్ లో మామిడి అల్లం ముక్కలు,
ఉప్పు వేసి బాగా మెత్తగా రుబ్బాలి. 

 

మెత్తగా అయిన అల్లం లో  
కారం కూడా కలిపి రుబ్బాలి. 



 ఈ మిశ్రమం లో ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు 
గుజ్జువేసి, చేత్తో పట్టుకుంటే మెత్తగా అనిపించేదాకా రుబ్బాలి.
ఇప్పుడు ఇందులో ఆవపిండి,మెంతి పిండి,
 కూడా వేసి బాగా కలిసేదాకా రుబ్బాలి. 



పొట్టు  తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు , 
బెల్లం తురుము  వేసి మెత్తగా అయ్యేదాకా రుబ్బాలి. 




 మామిడి అల్లం సువాసన తో పాటూ, ఆవపిండి,మెంతి పిండి 
ఘాటు వాసనతో  ఘుమ ఘుమలాడే మామిడి అల్లం పచ్చడి రెడీ.. 




  ఎప్పుడు  తినాలనుకుంటే అప్పుడు కావలసినంత 
పచ్చడి తీసుకుని, తగినంత నూనె లో తాలింపు గింజలు,
వెల్లుల్లి రెబ్బలు,ఎండుమిర్చి వేసి వేగాక, పచ్చడి వేసి
కాసేపు మగ్గించుకుంటే మామిడల్లం వెరైటీ ఫ్లేవర్,సువాసన తెలుస్తూ,
మామిడి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది . 





ఈ పచ్చడి శుభ్రమైన జాడీ  లేదా ఎయిర్ టైట్ డబ్బాలో 
పెట్టుకుని,తడి తగలకుండా  జాగ్రత్త  చేసుకోవాలి .

పచ్చడి అంతా ఒకే సారి తాలింపు వేస్తె నూనె మాగుడు వాసన వస్తుంది 
అందుకే కావలసినప్పుడు తాలింపు పెట్టుకుంటే  
పచ్చడి రుచిగా చాలా రోజులు నిల్వ వుంటుంది 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు