.

.

nani

26, మే 2015, మంగళవారం

మామిడి అల్లంతో మామిడి ఆవకాయ / Mango Pickle With Mango Ginger


 ఆవకాయలో ప్రత్యేకమైన,మాకిష్టమైన మరో రకం "మామిడి అల్లంతో మామిడి ఆవకాయ" ఇప్పటిదాకా మాకు తెలిసిన వాళ్ళు కానీ,పేపర్స్ లో కానీ,నెట్ లో కానీ మామూలు అల్లం,వెల్లుల్లి పేస్ట్ చేసి దాన్ని మామిడికాయ పచ్చడిలో కలిపితే అదే "అల్లం ఆవకాయ" అంటున్నారు.. కానీ నేను చేసేది మామూలు కూరల్లో వాడే అల్లం కాదు. మామిడి అల్లం.ఇది పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా దొరుకుతుంది.మామూలు అల్లం,వెల్లుల్లి పేస్ట్ తో చేసే ఆవకాయ కంటే మామిడి అల్లంతో చేసే ఆవకాయ మంచి ఫ్లేవర్,రుచితో చాలా బాగుంటుంది.ఈ మామిడి అల్లాన్ని పండుమిర్చి పచ్చడిలో కూడా వేసి గ్రైండ్ చేస్తే పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుంది. 

"మామిడిఅల్లం నిల్వపచ్చడి",మరికొన్ని ఆవకాయలు ఈ కింద లింక్ లో చూడొచ్చు.. 

మామిడిఅల్లం నిల్వ పచ్చడి / Mango Ginger Pickle

ఆంధ్రా ఆవకాయ /Andhra Mango pickle

శనగలతో మామిడి ఆవకాయ / Mango Pickle with Chick Peas

స్వీట్ మ్యాంగో చట్నీ / Gujarati Sweet Mango Pickle

 
 



కావలసినవి

పుల్లగా,గట్టిగా ఉండే మామిడికాయ ముక్కలు  - మానెడు 
మామిడి అల్లం - 1/4 k.g
కారం - 2  గిద్దలు 
ఉప్పు - 2 గిద్దలు 
(రాళ్ళ  ఉప్పు మిక్సీ లో  పొడి చేసి వేసుకోవాలి  )
ఆవాలు - 100 గ్రాములు 
మెంతులు - 25 గ్రాములు 
జీలకర్ర - 25 గ్రాములు 
పసుపు - 1 టేబుల్ స్పూన్ 
వెల్లుల్లి రేకలు - 1/4 k.g 
నువ్వుల నూనె/పల్లీ నూనె - 1/2 కిలో (ముక్కలు మునిగేంత)



తయారుచేసే విధానం

మామిడి కాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు కొట్టించి,
ముక్కల్ని పొడి గుడ్డతో తుడిచి, 
లోపలున్న పొర,జీడి  లేకుండా జాగ్రత్తగా తీసేయాలి.



ఆవాలు,మెంతులు,జీలకర్రలను శుభ్రం చేసి,
కొద్దిసేపు ఎండలో పెట్టి 
వేయించకుండా,పచ్చివాటినే మెత్తగా పొడి చేయాలి.




ఒక వెడల్పాటి టబ్ లో మామిడికాయముక్కలు
ఉప్పు,పసుపు కారం,ఆవపిండి,మెంతిపిండి,
జీలకర్రపొడి,వెల్లుల్లి రెబ్బలు కొన్ని,
కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కొన్ని వేయాలి



మసాలా పొడులన్నీ బాగా కలిసేలా కలపాలి.


కలిపిన మసాలా పొడుల్లో మామిడికాయ ముక్కలు 
కూడా కలిసేలా బాగా కలపాలి.



మామిడి అల్లాన్ని శుభ్రంగా కడిగి పై పొర తీసేసి,
కొంచెం పెద్దగా తురమాలి. 
 
 
తురిమిన మామిడి అల్లాన్ని మసాలా పొడులు కలిపిన
మామిడికాయ ముక్కల్లో వేయాలి.
 
 
మామిడి అల్లం అంతా మసాలా,మామిడికాయముక్కల్లో 
కలిసేలా కలపాలి.
 
 
 మసాలాలో కలిపిన మామిడికాయ ముక్కలు,
మామిడి అల్లం తురుములో తగినంత నూనె పోయాలి.

@ పచ్చడిలో వేరుశనగ నూనె కానీ,నువ్వుల నూనె కానీ
వరి ఇష్టాని బట్టి వాళ్ళు వాడొచ్చు.@
 
 
నూనె,మసాలా పొడులు,మామిడికాయముక్కలు,
మామిడి అల్లంతురుము  అన్నీ బాగా కలిసేలా కలిపి 
శుభ్రమైన జాడీలో పెడితే 
మామిడి అల్లంతో మామిడి ఆవకాయ రెడీ.. 

3 రోజుల తర్వాత పచ్చడి అంతా ఒకసారి బాగా కలిపి,
నూనె సరిపోయిందా లేదా చూసి 
అవసరమైతే ముక్కలపై తేలేలా మరికొంత నూనె కలపాలి. 
 @ ఉప్పు సరిపోయిందా లేదా కూడా చూస్తే అప్పుడు కలపొచ్చు.
 
 

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు