.

.

nani

15, మే 2015, శుక్రవారం

నన్నారి షర్బత్ - సుగంధి సోడా / Nannari - Sugandhi Soda

రాయలసీమలో  ఫేమస్, నాచురల్ హెల్త్ & సమ్మర్ డ్రింక్ నన్నారి / సుగంధి షర్బత్. కడప జిల్లాలో కొన్ని అటవీ ప్రాంతాల్లో దొరికే వనమూలికల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు,"సుగంధి పాల చెట్టు" వేర్లను కత్తిరించి, బాగా ఎండబెట్టి, తగినన్ని నీళ్ళు పోసి మరిగించి,ఆ రసాన్ని వడగట్టి,దానికి తగినంత పంచదార కలిపి,బాగా చిక్కగా పాకం వచ్చేలా మరిగిస్తే నన్నారి సిరప్ రెడీ అయినట్లే.. 

తయారయిన  చిక్కటి సిరప్ ని చల్లటి నీళ్ళతో కానీ సోడా తో కానీ కలిపి తాగితే ఎండల్లో చాలా హాయిగా ఉంటుంది.శరీరంలో వేడి తగ్గించి,వేసవి తాపానికి విరుగుడుగా ఈ సుగంధి / నన్నారి చక్కగా పని చేస్తుంది... 

ఈ సుగంధి పాల వేర్లు మనకి మార్కెట్లో దొరికినా, వాటితో సిరప్ తయారుచేయటం కొంచెం కష్టమే కాబట్టి , "గిరిజన సహకార సంస్థలు" తయారుచేసేవి,ఇంకా మార్కెట్లో దొరికే మంచి బ్రాండ్ సుగంధి సిరప్ తో ఇంట్లోనే ఈజీగా సుగంధి డ్రింక్ చేసుకోవచ్చు. కేవలం కడపలోనే కాదు అన్ని చోట్లా ఫేమస్ అయిన ఈ నన్నారి / సుగంధి సిరప్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది. 

మొదటి సారి "సుగంధి సోడా" మాకు పరిచయం చేసింది మా అబ్బాయి వంశీ .. సమ్మర్ వస్తే చాలు,సాయంత్రాలు తప్పకుండా సుగంధి సోడా తాగి వచ్చి,చాలా బాగుంటుందని నాకు,మా అమ్మాయిలకి చెప్పేవాడు. మా చిన్నమ్మాయి అడిగిందని ఒకరోజు ఇంటికి "సుగంధి సిరప్" తెచ్చి, కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు కలిపే లాగా తనే కలిపి ఇచ్చాడు.. మా అందరికీ చాలా నచ్చింది.అప్పటి నుంచి మా సమ్మర్ స్పెషల్స్ లో తప్పకుండా ఉంటుందీ "నన్నారి షర్బత్ - సుగంధి సోడా"

 

 నన్నారి షర్బత్ - సుగంధి సోడా
 తయారు చేయటానికి 
కావలసినవి 

నన్నారి/సుగంధి సిరప్ - 1/4 కప్పు 
నిమ్మకాయ - 1 /2 చెక్క 
సోడా - 3/4 కప్పు 
ఐస్ క్యూబ్స్ - 5



తయారుచేసే విధానం 

ఒక గ్లాస్  లో ఐస్ క్యూబ్స్ వేసి ,
సుగంధి సిరప్ పోయాలి. 


 సుగంధి సిరప్ లో నిమ్మరసం పిండాలి 


సుగంధి సిరప్,నిమ్మరసం బాగా కలిపి,
తగినంత సోడా కలపాలి.



చక్కటి సువాసనతో,తియ్యగా,పుల్లగా 
నన్నారి షర్బత్ - సుగంధి సోడా రెడీ..


*చల్లటి నీళ్ళతో కూడా సుగంధి డ్రింక్ చేసుకోవచ్చు కానీ 
సోడా లోనే టేస్ట్ బాగా తెలుస్తుంది*



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు