.

.

nani

13, మే 2015, బుధవారం

సమ్మర్ డ్రింక్ - రోజ్ మిల్క్ / Rose Milk

గులాబీ పువ్వు సువాసన,అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గులాబీలకు బదులుగా సౌందర్య సాధనాల్లో కానీ,స్వీట్స్ లో కానీ రోజ్ వాటర్ ఉపయోగిస్తారు.రోజ్ వాటర్ లాగే రోజ్ సిరప్ కూడా చక్కని గులాబీ పరిమళంతో చాలా బాగుంటుంది. రోజ్ సిరప్ తో చేసే రోజ్ మిల్క్ ఎంతో మంచి రోజ్ ఫ్లేవర్, వాసనతో అందరూ ఇష్టపడే టేస్టీ సమ్మర్ డ్రింక్ .. చేయటం చాలా ఈజీ కూడా..  

రోజ్ మిల్క్ చేయటానికి కావాల్సిన రోజ్  సిరప్ ఇంట్లో కూడా తయారు చేయొచ్చు,లేదంటే రెడీమేడ్ రోజ్ సిరప్ తో కూడా చేయొచ్చు.  నేను రెడీమేడ్  రోజ్ సిరప్ తోనే రోజ్ మిల్క్ చేశాను. 



రోజ్ సిరప్ చేయటానికి కావలసినవి 

పంచదార - 2 కప్పులు 
నీళ్ళు - 1 1/2 కప్పులు 
పింక్ ఫుడ్ కలర్ - 3/4 టీ స్పూన్
రోజ్ ఎసెన్స్ - 1 టీ స్పూన్ 

రోజ్ సిరప్ తయారుచేసే విధానం 

అడుగు మందంగా ఉన్న గిన్నెలో పంచదార,నీళ్ళు పోసి 
బాగా కలిపి,పంచదార కరిగేదాకా మరిగించాలి. 

ఈ షుగర్ సిరప్ 4 నిమిషాలు మరిగిన తర్వాత 
పింక్ ఫుడ్ కలర్ వేసి,కలపాలి. 

సిరప్ బాగా మరిగి తీగ పాకం వచ్చేదాకా మరిగించి,
స్టవ్ ఆఫ్ చేసి,రోజ్ ఎసెన్స్ వేసి కలపాలి. 

రోజ్ సిరప్ తయారయినట్లే.. పూర్తిగా చల్లారిన తర్వాత,
ఒక బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి.



రోజ్ సిరప్ తో రోజ్ మిల్క్ 
చేయటానికి  కావలసినవి

కాచి చల్లార్చిన చిక్కటి పాలు - 1 కప్పు 
రోజ్ సిరప్ - 3 టేబుల్ స్పూన్లు 
ఐస్ క్యూబ్స్ - 5-10



రోజ్ మిల్క్ తయారుచేసే విధానం

మరిగించి,చల్లార్చిన చిక్కటి పాలల్లో 
రోజ్ సిరప్ వేసి కలపాలి.  

కలిపిన పాలని ఫ్రిజ్ లో బాగా 
చల్లబడే దాకా ఉంచాలి.


ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్,
కొద్దిగా రోజ్ సిరప్ వేయాలి


ఐస్ క్యూబ్స్,రోజ్ సిరప్ వేసిన గ్లాస్ లో 
ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి రోజ్ మిల్క్ పోయాలి.


 Cool, Refreshing Summer Drink 
రోజ్ మిల్క్ రెడీ ..

ఈ డ్రింక్ ని చాలా చల్లగా (ice  cold)
 తాగితేనే  టేస్ట్ బాగుంటుంది. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు