.

.

nani

21, మే 2015, గురువారం

వెజ్ సమోసా / Vegetable Samosa

ప్రస్తుతం సమోసాల్లో రకరకాల ఫిల్లింగ్స్ పెట్టి చేస్తున్నారు కానీ మొదట్లో సమోసా అంటే ఉల్లిపాయలు, పచ్చిబఠాణీ బంగాళదుంప తో చేసినవే ఉండేవి... ఇవి టీ టైమ్ స్నాక్స్ గా బాగుంటాయి.. 

ఇంతకుముందు చేసిన సమోసాలు కింద లింక్ లో చూడొచ్చు


వెజ్ సమోసా



కావలసినవి 

పచ్చి బఠానీలు - 1/2 కప్పు
అటుకులు - 1/2 కప్పు
బంగాళాదుంప -1
ఉల్లిపాయ - 1
క్యారట్ -1 
పచ్చిమిర్చి - 2
కరివేపాకు,పుదీనా,కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు- రుచికి సరిపడా 
పసుపు - చిటికెడు
నూనె - డీప్  ఫ్రై కి సరిపడా 

తయారుచేసే విధానం

పచ్చిబఠానీలను ఉడికించి,నీళ్ళు వడగట్టి పెట్టాలి. 
అటుకులు నీళ్ళలో కొద్దిసేపు వుంచి,
మెత్తబడ్డాక నీళ్ళు వంపెయ్యాలి. 

బంగాళాదుంప, ఉల్లిపాయ,క్యారట్,పచ్చిమిర్చి
కరివేపాకు,పుదీనా,కొత్తిమీర అన్నిటినీ సన్నగా తరగాలి




ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన 
కూరగాయముక్కలు 
పసుపు,ఉప్పు,వేసి 2-3 నిమిషాలు మగ్గించాలి. 


మగ్గిన కూరగాయ ముక్కల్లో ముందుగానే 
ఉడికించిన  పచ్చిబఠానీలను వేసి కలపాలి.



చివరిగా నీళ్ళలో నానబెట్టిన అటుకులు 
కూడా వేసి కలిపితే వెజ్ ఫిల్లింగ్ రెడీ అయినట్లే 



రెడీ అయిన వెజ్ ఫిల్లింగ్ ని సమోసా పట్టీలో
నింపి,అంచులను నీళ్ళలో కలిపినా మైదాతో అతికించాలి.



ఇలా అన్ని సమోసాలను ఫిల్లింగ్ తో 
నింపి తయారు చేసి పెట్టాలి.


బాండీలో డీప్ ఫ్రై కోసం నూనె పోసి కాగాక,
తయారుచేసి పెట్టిన సమోసాలను వేసి,
మీడియం మంట మీద వేయించాలి.



 వెజ్ సమోసా / Vegetable Samosa రెడీ .. 
టమాటా సాస్ తో తింటే చాలా బాగుంటాయి. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు