.

.

nani

11, అక్టోబర్ 2015, ఆదివారం

మటన్ ఖీమా బిర్యాని / Mutton Kheema Biryani




ఖీమా కర్రీ కోసం కావలసినవి

మటన్ ఖీమా - 1/2 kg
ఉల్లిగడ్డలు  - 2 పెద్దవి
టమాటా ముక్కలు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 5
పసుపు - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 టీ స్పూన్లు
గరం మసాల పొడి - 1 tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
నూనె - 1/4 కప్పు
లవంగాలు - 4
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1 చిన్నముక్క
కరివేపాకు - 3 రెమ్మలు
కొత్తిమీర - 1 కట్ట
పుదీనా - కొద్దిగా 

బిర్యానీ కోసం కావలసినవి 

బాస్మతి రైస్ - 2 కప్పులు 
 జీడిపప్పు - 10
లవంగాలు - 2
షాజీరా - కొద్దిగా 
మరాఠీ మొగ్గ - 1
యాలకులు -2 
కొత్తిమీర,పుదీనా - కొద్దిగా
పెరుగు - 1 టేబుల్ స్పూన్  
నిమ్మరసం - 1 చెక్క 
నీళ్ళు - 4 కప్పులు 
నెయ్యి - 1 టేబుల్ స్పూన్


ఖీమా కర్రీ తయారుచేసే విధానం

మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పెట్టాలి. టమాటా, 
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి సన్నగా తరగాలి 



బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు 
వేసి ఫ్రైడ్ ఆనియన్స్ తయారుచేయాలి.



కూరలో ఫ్రై చేసే మామూలు ఉల్లిపాయల కంటే డీప్ ఫ్రై చేసి 
తయారుచేసే  ఫ్రైడ్ ఆనియన్స్ తో చేసిన కూరలు కానీ ,
బిర్యానీ కానీ చాలా రుచిగా ఉంటాయి. 
 అందుకే ఈ బిర్యానీలో మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ ఉపయోగించాము.



బాండీలో కూరకి సరిపడా నూనె వేసి కాగాక,
యాలకులు,లవంగాలు,దాల్చిన చెక్క వేసి కొంచెం వేయించి,
 ఫ్రైడ్ ఆనియన్స్ , పచ్చిమిర్చి,కరివేపాకు వేసి 

ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 
ఖీమా కూడా  వేయాలి



మటన్ ఖీమాను వేసి బాగా కలిపి ,
10 నిమిషాలు మీడియం మంటలో ఉడికించుకోవాలి.

 తర్వాత టమాటా ముక్కలు కూడా కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలి.

తగినంత ఉప్పు,పసుపు కారం,గరం మసాలా కూడా వేసి 
మరొక 10 నిమిషాలు ఉడికించాలి.
 చివరిగా కొత్తిమీర వేసి, కొంచెం సేపు సిమ్ లో వుంచి మగ్గనివ్వాలి


మటన్ ఖీమా కర్రీ పూర్తయినట్లే



ఖీమా బిర్యానీ తయారుచేసే విధానం

కుక్కర్ లో నెయ్యి వేసి కాగాక లవంగాలు,యాలకులు,
షాజీరా, జీడిపప్పు వేసి వేయించాలి. 

ఇందులో ముందుగా కడిగి 1/2 గంట నానబెట్టిన 
బాస్మతి రైస్ వేసి కలపాలి. 

ఈ రైస్ లో తయారుచేసి పెట్టుకున్న ఖీమా కర్రీ 
కూడా వేయాలి.



ఖీమా,బియ్యం బాగా కలిపి ఇందులో  పెరుగు,
కొత్తిమీర,పుదీనా, కావాలనుకుంటే కొన్ని టమాటా ముక్కలు,
కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. 

4 కప్పుల నీళ్ళు పోసి బాగా కలిసేలా కలపాలి



చివరిగా నిమ్మరసం పిండి, కుక్కర్ మూతపెట్టి 
3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తే మటన్ ఖీమా బిర్యానీ రెడీ



 కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ తో 
గార్నిష్ చేస్తే టేస్టీ & స్పైసీ 
మటన్ ఖీమా బిర్యానీ కూరతో పనిలేకుండా  తినేయొచ్చు , 
పెరుగురైతాతో తింటే చాలా బాగుంటుంది. 



2 వ్యాఖ్యలు:

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు