.

.

nani

12, అక్టోబర్ 2015, సోమవారం

మాకరోని పకోడీ





 కావలసినవి 

మాకరోని - 1 కప్పు 
శనగపిండి  - 1/2 కప్పు 
బియ్యంపిండి - 1 టేబుల్ స్పూన్ 
 ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా 
కారం - కొద్దిగా 
ఉప్పు - రుచికి సరిపడా 
గరం మసాలా - 1/2 టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీ స్పూన్ 
జీలకర్ర - 1 టీ స్పూన్ 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా 




తయారుచేసే విధానం 

1 కప్పు మాకరోనికి నాలుగు కప్పుల నీళ్ళు పోసి,
చిటికెడు ఉప్పు వేసి ఉడికించాలి.

 ఉడికిన మాకరోని నీళ్ళు వడకట్టి పక్కన పెట్టాలి.

ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాలి.



ఒక గిన్నెలో ఉడికించిన మాకరోని,శనగపిండి,బియ్యంపిండి
ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర,కారం,ఉప్పు,
అల్లంవెల్లుల్లి పేస్ట్,జీలకర్ర వేసి పకోడీల పిండిలా కలపాలి.


బాండీలో డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసి కాగాక 
పకోడీలు వేసి బాగా ఎర్రగా వేయిస్తే
మాకరోని కూడా క్రిస్పీగా  వేగుతుంది.


మాకరోని పకోడీ రెడీ .. టమాటా సాస్ తో తింటే 
చాలా బాగుంటాయి. 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు