.

.

nani

23, జనవరి 2016, శనివారం

(వంకాయ) బైంగన్ కా సాలన్ / Baingan (Brinjal) ka Salan

వంకాయ చాలా సులభంగా చేసుకునే కూరగాయల్లో ఒకటి. చాలా రకాలుగా వండొచ్చు. చాలామంది ఇష్టపడే కూర కూడా..ఈ బైంగన్ కా సాలన్ వెజ్  బిర్యానీ,  చపాతీ, రోటీల్లో చాలా బాగుంటుంది. 

బైంగన్ కా సాలన్


కావలసినవి 
 
 వంకాయలు - 1/2 k.g 
ఉల్లిపాయలు - 2 
పచ్చిమిర్చి - 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 tsp 
గరం మసాలా - 1 tsp 
జిలకరపొడి - 1/2 tsp 
చింతపండు గుజ్జు - 2 tsp
కారం - 2 tsp 
ఉప్పు - రుచికి సరిపడా  
పసుపు - 1/2 tsp  
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర - కొద్దిగా 
నూనె - 1/2 కప్పు 

మసాలాపేస్ట్  కోసం కావలసినవి  
 
ఎండుకొబ్బరి - చిన్నముక్క 
వేరుశనగ గుండ్లు (పల్లీలు) - 1 tbsp 
తెల్ల నువ్వులు - 1 tbsp 
జిలకర - 1tsp 
ధనియాలు - 1 tsp 


తయారుచేసే విధానం 

వేరుశనగ గిజలు,నువ్వులు,ధనియాలు,జిలకర అన్నిటినీ 
బాండీలో నూనె లేకుండా (Dry roast) వేయించి 
వీటికి ముక్కలుగా తరిగిన కొబ్బరి కలిపి 
మిక్సీలో మెత్తగా మసాలా పేస్ట్ తయారుచేసి పెట్టాలి.


వంకాయలని శుభ్రంగా కడిగి తొడిమ తీసేయకుండా 
నిలువుగా ఇలా ఫోటోలో ఉన్నట్లు చీలికలు చేసి పెట్టాలి.


 కట్ చేసిన వంకాయలని నూనెలో వేయించి 
పక్కన పెట్టాలి. 
 
ఇలా వేయించటం వలన వంకాయలు 
కూరలో పచ్చిగా  లేకుండా పూర్తిగా ఉడుకుతాయి.


బాండీలో నూనె వేసి కాగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 
ఎండుమిర్చి, బిర్యాని ఆకు కరివేపాకు,పసుపు,
వేసి,ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా వేయించాలి.


 మెత్తగా వేగిన ఉల్లిపాయల్లో అల్లంవెల్లుల్లి పేస్ట్,
పల్లీలు,నువ్వుల పేస్ట్,గరం మసాలా
వేసి కలపాలి. 

  ఇందులో  జిలకర పొడి,ఉప్పు,కారం వేసి 
బాగా కలిపి, మసాలా పేస్ట్ పచ్చివాసన  పోయేదాకా 
5 నిమిషాలు వేయించాలి.


చింతపండు గుజ్జులో  1/2 కప్పు నీళ్ళు కలిపి 
 వేగిన మసాలా మిశ్రమంలో పోసి బాగా కలపాలి. 


గ్రేవీని 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించిన 
తర్వాత నూనెలో వేయించి పెట్టిన 
వంకాయలు వేసి కలపాలి.


వంకాయలు మసాలా అంతా  పట్టి, ఉడికేదాకా 
 మూత పెట్టి 10 నిమిషాలు 
మీడియం మంటమీద ఉడికించాలి. 


చివరిగా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ
బైంగన్ కా సాలన్ / Baingan (Brinjal) ka Salan
రెడీ..



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు