.

.

nani

19, జనవరి 2016, మంగళవారం

మాడ్చినకారం / కారప్పొడి / ఇడ్లీ కారం / నల్లకారం

కారప్పొడిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.మేము మాడ్చినకారం అంటాము.ఇడ్లీ,దోశల్లో,వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే 
చాలా రుచిగా ఉండే మాడ్చినకారం తయారుచేయటం కూడా ఈజీనే.

మాడ్చినకారం


కావలసినవి 

ఎండుమిరపకాయలు - 100 గ్రాములు 
పచ్చిపప్పు - 1 tbsp 
ధనియాలు - 1 tbsp 
మినప్పప్పు - 1 tbsp 
జిలకర - 1 tbsp 
చింతపండు - కొద్దిగా 
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు - 4 రెమ్మలు 
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 tbsp

తయారుచేసే విధానం 

బాండీలో నూనె వేసి ఎండుమిర్చి,ధనియాలు,
పచ్చిపప్పు,మినప్పప్పు,జిలకర,కరివేపాకు 
అన్నిటినీ వేరువేరుగా వేయించి ప్లేట్ లో పెట్టి చల్లారనివ్వాలి.



మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న 
పచ్చిపప్పు,మినప్పప్పు,జిలకర,ధనియాలు 
కరివేపాకు,తగినంత ఉప్పు వేసి  పొడి చేయాలి. 


తయారయిన పప్పుల పొడిలో వేయించి పెట్టిన 
ఎండుమిర్చి కూడా వేసి కొంచెం బరకగా అవ్వగానే  
 ఇందులో చింతపండు,వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 
మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టాలి


మాడ్చిన కారం రెడీ. దీన్ని మూత గట్టిగా ఉన్న 
డబ్బాలో  పెట్టుకుంటే వాసన,తాజాదనం పోకుండా 
నిల్వ వుంటుంది.



 ఇడ్లీలో మాడ్చినకారం,నెయ్యి రుచి 
తప్పకుండా తిని చూడాల్సిందే..


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు