.

.

nani

17, జనవరి 2016, ఆదివారం

క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ / Crispy Fish Fingers

మాంసాహారం ఇష్టపడే వాళ్ళకి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పే చేపతో రకరకాల వంటలు చేయొచ్చు.ఎప్పుడూ పులుసు,ఫ్రైలే కాకుండా ఫిష్ తో ఇలా స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు.ఈ క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ / Crispy Fish Fingers అన్నంలో సాంబార్,రసంతో  తింటే చాలా బాగుంటాయి.
క్రిస్పీ ఫిష్ ఫింగర్స్


ఫిష్ మారినేట్ చేయటానికి

ముళ్ళు లేని చేపముక్కలు - 1k.g
 గరం మసాలా పొడి- 1tbsp
ధనియాలపొడి - 1 tbsp
జిలకరపొడి - 1/2 tbsp
కారం -  tbsp
పసుపు - 1 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - 1 /2 కప్పు
మైదా - 1/4 కప్పు
నిమ్మకాయ - 1/2 చెక్క
సోయాసాస్ - 1 tsp 

నూనె  - డీప్  ఫ్రై కి సరిపడా  


తయారుచేసే విధానం

ముళ్ళు లేని చేపల్ని  శుభ్రంగా కడిగి, 
పలచని ముక్కలుగా కట్ చేయాలి.


మసాలా పేస్ట్ తయారు చేసేలోపు కట్ చేసిన చేప ముక్కలకి 
ఉప్పు,పసుపు,కారం నిమ్మరసం పట్టించి పక్కన పెట్టాలి 

*ఇలా కలిపి పెడితే వేగిన తర్వాత చేపముక్క చప్పగా లేకుండా ఉంటుంది.*


ఒక బౌల్ లో మైదా,కార్న్ ఫ్లోర్,ధనియాల పొడి,గరంమసాలా పొడి,
జిలకర పొడి, ఉప్పు, పసుపు,కారం,నిమ్మరసం,సోయాసాస్ 
అన్నీ బాగా కలిపి మసాలా పేస్ట్ తయారుచేయాలి


ముందుగా ఉప్పు,పసుపు,కారం,నిమ్మరసం కలిపి పెట్టిన చేపముక్కల్ని 
ఈ మసాలా పేస్ట్ లో వేసి మసాలా అంతా  కలిసేలా బాగా కలిపి 
5 నిమిషాలు మారినేట్ చేయాలి.


బాండీలో నూనె పోసి బాగా కాగాక మారినేట్ చేసి పెట్టిన 
చేపముక్కల్ని మీడియం మంటలో వేయిచాలి.


గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా  వేయిస్తే 
క్రిస్పీ ఫిష్ ఫింగర్స్ రెడీ



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు