.

.

nani

18, జనవరి 2016, సోమవారం

ఫూల్ మఖానా ఖీర్ / Phool Makhana Kheer

తామరపువ్వు గింజలే ఈ ఫూల్ మఖానా.వీటిని Fox nuts అని కూడా అంటారు వేయించుకునీ,ఎండబెట్టి ఉడికించుకునీ ఇలా రకరకాలుగా వీటిని తింటుంటారు.ఉత్తరాదిన అన్ని రకాల పండగలూ పూజల్లో వీటితో ప్రత్యేకంగా వంటల్ని తయారుచేసి నైవేద్యంగానూ పెడతారు.కేవలం మనదేశంలోనే కాదు, తూర్పుఆసియా దేశాలన్నింటిలోనూ డెజర్ట్‌లూ స్వీట్ల తయారీలోనూ వాడుతుంటారు.ఇవి అన్నిచోట్ల దొరుకుతూనే ఉంటాయి. పాప్‌కార్న్‌లాగా కనిపించే ఈ తామరగింజల్లో  ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి మఖానాను యాంటి ఆక్సిడెంట్‌గా చెప్తారు.వీటిలో సోడియం తక్కువ,పొటాషియం ఎక్కువగా ఉండటం వలన B.P ఉన్నవాళ్ళకి కూడా మంచిదట.ఇంతమంచి ఆరోగ్యవిలువలున్న ఈ ఫూల్ మఖానాని కూరల్లాగానే కాకుండా ఇలా ఖీర్ చేసుకుంటే అందరికి నచ్చుతుంది.ఇష్టంగా తింటారు. చేయటం కూడా ఈజీగా అయిపోతుంది. 
ఫూల్ మఖానా ఖీర్


కావలసినవి 

ఫూల్ మఖానా (తామరగింజలు) - 1 కప్పు
పాలు - 1/2 లీటర్
పంచదార - 4 tbsp
నెయ్యి - 1 tbsp
యాలకులపొడి -1/2 tsp 
బాదంపప్పు  - 4

 తయారుచేసే విధానం 
ఒక బాండీలో కొంచెం నెయ్యి వేసి ఫూల్ మఖానాని
ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించి పక్కన పెట్టాలి.


 వేయించిన ఫూల్ మఖానాలో కొన్ని మిక్సీజార్ లో 
వేసి పొడి చేసి పెట్టాలి. 


అడుగు మందంగా ఉన్న బాండీ,లేదా గిన్నెలో 
పాలు పోసి మరిగించాలి. 


మరిగిన పాలలో పొడి చేసి పెట్టిన 
ఫూల్ మఖానావేసి బాగా కలపాలి. 


ఇందులో 4 tbsp పంచదార, 
యాలకులపొడి వేసి కలపాలి. 
 

ఇప్పుడు మిగిలిన ఫూల్ మఖానా కూడా వేసి 
బాగా కలిపి సిమ్ లో 9 - 10 నిమిషాలు 
ఉడికించాలి. 


బాదం పలుకులు వేసి,పూర్తిగా సిమ్ లో ఉంచి 
2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి 


టేస్టీగా, ఈజీగా తయారయ్యే 
ఫూల్ మఖానా ఖీర్ / Phool Makhana Kheer
రెడీ .. దీన్ని వేడిగా కానీ చల్లగా కానీ తినొచ్చు. 
చల్లబడితే కొంచెం చిక్కగా తయారయ్యి బాగుంటుంది. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు