.

.

nani

20, జనవరి 2016, బుధవారం

సాబు దానా కిచిడి / Sabudana kichdi

సగ్గుబియ్యంతో చేసే ఈ సాబుదానా కిచిడి వ్రతాలు ఉపవాసాలు చేసేటప్పుడు తినే వంటకంగా, మహారాష్ట్రియన్ ఫుడ్ గా కూడా ప్రసిద్ధి.ఇది చేయటం చాలా సులభంగా తక్కువ సమయంలోనే అయిపోతుంది.. కానీ సగ్గుబియ్యాన్ని మాత్రం వండటానికి 5 గంటలు ముందు నానబెట్టాలి. 

సాబు దానా కిచిడి


కావలసినవి 

సగ్గుబియ్యం - 1 కప్పు 
వేరుశనగ గుండ్లు (పల్లీలు) - 1 tbsp
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 1
నిమ్మచెక్క - 1
ఆవాలు
జిలకర
పచ్చిపప్పు  
కరివేపాకు - కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా 
 ఉప్పు - రుచికి సరిపడా 
పసుపు - చిటికెడు (optional)
నెయ్యి - 1 tbsp


తయారుచేసే విధానం 

ఎక్కువ నీళ్ళు పోయకుండా, 
సగ్గుబియ్యం మునిగేలా మాత్రమే నీళ్ళు పోసి
సగ్గుబియ్యాన్ని ఒక రాత్రంతా లేదా కనీసం 5 గంటలు నానబెట్టాలి.

నానబెట్టిన సగ్గుబియ్యం
ఉదయానికి నీళ్లన్నీ పీల్చుకుని,మెత్తగా అవుతాయి


బాండీలో నెయ్యి వేసి కాగాక 
ఆవాలు,జిలకర,పచ్చిపప్పు కొద్దిగా వేసి వేగగానే 
ఎండుమిర్చి,పచ్చిమిర్చి,పల్లీలు కూడా వేసి తాలింపు వేగనివ్వాలి


వేగిన తాలింపులో నాబెట్టిన సగ్గుబియ్యం వేసి 
బాగా కలిపి,పసుపు,తగినంత ఉప్పు, వేసి,
మీడియం మంటలో సగ్గుబియ్యం అడుగంటకుండా 
కలుపుతూ 4 -- 5 నిమిషాలు ఉడికించాలి. 


సగ్గుబియ్యం మెరుస్తూ, transparent గా అయ్యేదాకా 
వేయించి ,చివరిలో నిమ్మరసం కలిపి,కొత్తిమీర చల్లితే 
 "సాబూదానా కిచిడీ" రెడీ


 Note 
  
*ఇందులో పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు 
*ఉడికించిన బంగాళాదుంపముక్కలు  కూడా కలుపుతారు. 
*సగ్గుబియ్యం నానబెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోయకూడదు 
మునిగేవరకు మాత్రమే పోయాలి 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు