.

.

nani

2, మే 2016, సోమవారం

కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై / Cauliflower Egg Fry


కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా అందరూ ఇష్టపడి తినే కూర..ఎప్పుడూ చేసినట్లు, కాలీ ఫ్లవర్, ఎగ్ విడివిడిగా చేసే ఫ్రైలు కాకుండా ఈ రెండిటి కాంబినేషన్ అన్నం,చపాతీల్లో తింటే చాలా బాగుంటుంది. 

కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై / Cauliflower Egg Fry


 కావలసినవి 

కాలీఫ్లవర్ - 1/4 K.G 
కోడిగుడ్లు - 2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా 
పసుపు - 1/2 tsp 
ఉప్పు - రుచికి సరిపడా 
కారం - 1 tsp 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp 
గరం మసాలా పొడి - 1/2 tsp 
జీలకర్ర పొడి - 1/2 tsp 
నూనె - 2 tsp

తయారు చేసే విధానం 

కాలీ ఫ్లవర్ ని శుభ్రంగా కడిగి 
మీడియం సైజ్ ముక్కలు కట్ చేయాలి 

కట్ చేసిన కాలీ ఫ్లవర్ ని నీళ్ళలో వేసి 
కొంచెం,పసుపు ఉప్పు వేసి ఉడికించాలి.


ఉడికించిన కాలీఫ్లవర్ నీళ్ళు వంపేసి పెట్టాలి.

ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కొత్తిమీర 
సన్నగా తరగాలి. 


బాండీలో నూనె వేసి కాగాక కొంచెం 
తాలింపు గింజలు వేసి  వేగాక 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు.పచ్చిమిర్చి,
కరివేపాకు,కొత్తిమీర వేసి వేయించాలి.


వేగిన ఉల్లిపాయల్లో  ఉడికించి,నీళ్ళు వడగట్టి పెట్టిన 
కాలీ ఫ్లవర్ వేసి కలిపి,1tsp అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. 

అల్లం వెల్లుల్లిపేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించి,
కారం,జీలకర్ర పొడి వేసి బాగా కలిపి,5 నిమిషాలు మగ్గించాలి.


కాలీఫ్లవర్ బాగా మెత్తగా మగ్గిన తర్వాత, కోడిగుడ్డు సొన వేయాలి. 
గుడ్డుని కాసేపు కదపకుండా వేగనివ్వాలి.

*వెంటనే కదిపితే గుడ్డు సొన సరిగా వేగకుండా పచ్చివాసన వస్తుంది.


గుడ్డు బాగా వేగిన తర్వాత కూరంతా ఒకసారి కలిపి,
గరం మసాలా వేసి,మరో 5 నిమిషాలు వేయించాలి.


 స్పైసీ మసాలాలతో కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ .. దీని చపాతీల్లోకి, 
అన్నంలో రసం ,సాంబారుతో  సైడ్ డిష్ గా తినొచ్చు.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు