.

.

nani

4, మే 2016, బుధవారం

క్రిస్పీ కార్న్ / crispy corn

వర్షాకాలం వస్తే  బండిమీద అప్పటికప్పుడు కాల్చే వేడి వేడి మొక్కజొన్న కండెలు తినటం చాలా ఇష్టమైన పని.ఇప్పుడు ఆ మొక్కజొన్న కండెల స్థానంలో  స్వీట్ కార్న్ వచ్చేసింది. ఇప్పుడు  ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి.స్వీట్ కార్న్ ని కాల్చి,ఉడికించే కాదు, చాలా రకాల కూరలు, రైస్ వెరైటీలు కూడా చేయొచ్చు. క్రిస్పీ కార్న్  స్నాక్ లాగ  చాలా బాగుంటుంది.దీన్ని ఈజీగా కూడా చేసుకోవచ్చు.

*స్వీట్ కార్న్ డీప్ ఫ్రై చేసేటప్పుడు వాటిలో ఉన్న నీళ్ళ వలన ఒక్కోసారి పేలుతూ ఉంటాయి.అందుకే కొంచెం జాగ్రత్తగా వేయించాలి.


 కావలసినవి

స్వీట్ కార్న్ -1 కప్పు 
కార్న్ ఫ్లోర్ - 1 tbsp 
మైదా - 1 tbsp 
సోయాసాస్ - 1 tsp 
వెనిగర్ - 1 tsp 
కారం - 1 tsp 
ఉప్పు - రుచికి సరిపడా 
ఉల్లికాడలు - కొంచెం 
వెల్లుల్లి - కొద్దిగా 
అల్లం - కొద్దిగా 
బటర్ - 1 tsp


తయారుచేసే విధానం 

ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్,మైదా,సోయాసాస్,
వెనిగర్ కారం,ఉప్పు కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా పిండి కలపాలి


కలిపిన పిండిలో స్వీట్ కార్న్ వేసి కలిపి 
5 నిమిషాలు పక్కన పెట్టాలి.


డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక 
స్వీట్ కార్న్ వేసి ఎర్రగా క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి.



ఒక బాండీలో 1 tsp బటర్ వేసి ,
సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి,ఉల్లికాడలు వేసి 
కొద్దిగా వేయించాలి.  


ఇందులో ఫ్రై చేసి పెట్టిన స్వీట్ కార్న్ కూడా వేసి బాగా కలిపి 
స్టవ్ ఆఫ్ చేస్తే  క్రిస్పీ కార్న్ రెడీ



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు