.

.

nani

5, మే 2016, గురువారం

డబుల్ కా మీఠా / Hyderabadi Double Ka Meetha


"డబుల్ కా మీఠా" కి ట్రెడిషనల్ హైదరాబాదీ డెజర్ట్ అని పేరు. చిక్కటి పాలు, మిల్క్ మెయిడ్, క్రీమ్, రకరకాల డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. చేయటం కొంచెం కష్టమే అయినా అందరూ ఇష్టపడే ఈ ఫేమస్ స్వీట్ కొంచెం టైమ్, ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటే ఇంట్లోనే "హైదరాబాదీ డబల్ కా మీఠా" రుచి చూడొచ్చు. 

డబుల్ కా మీఠా / Hyderabadi Double Ka Meetha



కావలసినవి

బ్రెడ్  - 1 పాకెట్ 
పాలు - 1/2 లీటర్ 
మిల్క్ మెయిడ్ - 1/2 కప్పు 

 షుగర్ సిరప్ కోసం 
పంచదార - 1 కప్పు 
నీళ్ళు - 1 కప్పు 
యాలకుల పొడి - 1 tsp 

బాదంపప్పు  - 10 
జీడిపప్పు - 10
నెయ్యి / నూనె - బ్రెడ్ వేయించటానికి సరిపడా 

తయారుచేసే విధానం

బాండీలో నెయ్యి / నూనె పోసి కాగాక 
బ్రెడ్ వేసి ఎర్రగా వేయించాలి.
*నేను బ్రెడ్ డీప్ ఫ్రై చేశాను అలా ఇష్టం లేని వాళ్ళు బ్రెడ్ ని పెనం మీద రెండువైపులా కొంచెం ఎర్రగా అయ్యేలా వేయించి కూడా చేసుకోవచ్చు.


ఒక గిన్నెలో పంచదార,నీళ్ళు పోసి ,
పంచదార కరిగి చిక్కబడేదాక కరిగించి  స్టవ్ ఆఫ్ చేసి, 
తయారయిన షుగర్ సిరప్ పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
 

 తయారు చేసి పెట్టిన షుగర్ సిరప్ లో 
వేయించిన బ్రెడ్ వేసి బ్రెడ్ కి పాకం పట్టేలా 
కాసేపు  ఉంచి పక్కన పెట్టాలి.


 ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని పంచదార పాకం లో 
ముంచి పక్కన పెట్టాలి. 


అడుగు మందంగా ఉన గిన్నెలో పాలు పోసి కాగాక ,
మిల్క్ మెయిడ్ కూడా వేసి బాగా కలిపి,
పాలు చిక్కగా అయ్యేదాకా మధ్య మధ్య కలుపుతూ 
పాలని మరిగించాలి. 


బాదంపప్పు,జీడిపప్పు ముక్కలు చేసి పెట్టాలి 


యాలకులను మెత్తగా పొడిచేసి పెట్టాలి.

చిక్కబడ్డపాలల్లో యాలకులపొడి వేసి కలపాలి 


ఇప్పుడు ఒక ప్లేట్ కానీ బౌల్ లో కానీ
వేయించి,పంచదార పాకం పట్టిన బ్రెడ్ ముక్కల్ని వేసి
మరించిన పాలు వాటి మీద పోయాలి.


ఇలా మొత్తం పాలు పోసి కట్ చేసి పెట్టిన 
బాదం,జీడిపప్పు కూడా వేసి బ్రెడ్ ముక్కలకి 
పాలన్నీ పట్టి మెత్తబడేదాకా  ఉంచితే 
టేస్టీ డబుల్ కా మీఠా రెడీ అయినట్లే 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు