.

.

nani

24, జూన్ 2016, శుక్రవారం

పాల ఐస్ / Milk Ice / Milk Popsicle

చిన్నప్పుడు తిన్న పాలైస్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది.మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్లు. ఇళ్ళదగ్గర ఐస్ బండ్లు, డబ్బాల్లో అమ్మే ఐసులు అప్పట్లో తినేవాళ్ళం కానీ ఇప్పుడు వాటి స్థానంలో ఎన్నో కొత్త రకాలు వచ్చాయి. ఇప్పుడీ ఐస్ మౌల్డ్స్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 

 పాల ఐస్  / Milk Ice / Milk Popsicle


 కావలసినవి 
 పాలు - 2 కప్పులు 
పంచదార - 3 tsp
మిల్క్ పౌడర్ - 2 tsp 
కార్న్ ఫ్లోర్ - 2 tsp 
యాలకుల పొడి - 1/4 tsp 
నీళ్లు - 2 to 3 tsp

 తయారుచేసే విధానం 

  అడుగు మందంగా ఉన్న గిన్నెలో 
పాలు పోసి మరిగించాలి.


ఒక గిన్నెలో పాలపొడి,కార్న్ ఫ్లోర్, తగినన్ని నీళ్లు పోసి 
స్మూత్ పేస్ట్ తయారు చేయాలి. 

మరిగిన పాలలో పాలపొడి,కార్న్ ఫ్లోర్ తో 
తయారుచేసిన మిశ్రమం వేసి బాగా కలపాలి. 

తర్వాత పంచదార , యాలకులపొడి 
కూడా వేసి సన్నని మంట మీద కలుపుతూ మరిగించాలి. 

పాలు కొంచెం చిక్కబడి క్రీమ్ లాగా అవ్వగానే 
స్టవ్ ఆఫ్ చేయాలి లేకపోతే మరీ చిక్కబడి కస్టర్డ్ లాగా అవుతుంది.


ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత  
popsicle moulds/ ఐస్ మౌల్డ్స్ లో పోయాలి.

అన్ని మౌల్డ్స్ లో పాల మిశ్రమం పోసి మూతపెట్టి 
డీప్ ఫ్రిజ్ లో 8 గంటలు లేదా రాత్రంతా ఉంచాలి.

టేస్టీ , క్రీమీ పాల్ ఐస్ / Milk Ice  రెడీ 


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు