.

.

nani

16, జులై 2016, శనివారం

ఆలూ బోండా / Aloo / Potato Bonda


టీ/ కాఫీ టైం స్నాక్ ఆలూ బోండా. చేయటం కొంచెం టైం పట్టినా పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతుంది.బటాటా వడ పేరుతో ఇది మహారాష్ట్ర ఫేమస్ ఫాస్ట్ ఫుడ్

ఆలూ బోండా / Aloo / Potato Bonda


కావలసినవి

శనగపిండి - 2 కప్పులు
బియ్యప్పిండి - 1//2 కప్పు

కారట్ - 2
బంగాళాదుంపలు - 3 పెద్దవి  
కొత్తిమీర -
కొద్దిగా
కరివేపాకు  - 2 రెమ్మలు
పచ్చిమిర్చి - 2
నిమ్మరసం - 1 tsp
జీలకర్ర -
1/2 tsp
సోంపు - 1/2 tsp
ధనియాలు - 1/4 tsp
వాము - కొద్దిగా
గరం మసాలా పొడి - 1/2 tsp 
ధనియాలపొడి - 1/2 tsp 
కారం - 1 tsp
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా

నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
బేకింగ్ పౌడర్  - 1/4 tsp
 
తయారుచేసే విధానం
 
ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర,
అన్నీ సన్నగా తరగాలి, కారట్ తురమాలి. 
బంగాళా దుంప మెత్తగా ఉడికించి పొట్టుతీసి పెట్టాలి.
 

 బాండీలో తాలింపుకి నూనె వేసి కాగాక జీలకర్ర ,సోంపు 
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేసి వేయించాలి. 



పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి,
తురిమిన కారట్ కూడా వేసి వేయించాలి.


ముందుగానే  ఉడికించి పెట్టిన బంగాళా దుంపని చిదిమి 
వేగుతున్న కారట్ మిశ్రమంలో వేయాలి.


కారట్ , బంగాళా దుంప బాగా మగ్గిన తర్వాత 
కారం,గరం మసాలాపొడి,ధనియాల పొడి,
 కచ్చాపచ్చాగా దంచిన 1/4 tsp ధనియాలు (ఫ్లేవర్ కోసం )
 వేసి కలపాలి. 


చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం పిండి 
2 నిమిషాలు కలుపుతూ వేయించాలి.  
 


శనగపిండి లో బియ్యప్పిండి,బేకింగ్ పౌడర్,  
తగినంత ఉప్పు,కారం,వాము వేసి,తగినన్ని
నీళ్ళు పోసి, బజ్జీ  పిండిని కలిపి ఉంచాలి.

  
ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూరను  
చిన్న నిమ్మకాయ సైజ్ లో ఉండలుగా చేసి పెట్టాలి.


బజ్జీ పిండిలో ముంచి కాగి నూనెలో
వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.



 టేస్టీ ఆలూ బోండా రెడీ 
టమాటా సాస్ తో  తింటే రుచిగా వుంటాయి. 



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు