.

.

nani

23, జులై 2016, శనివారం

గోంగూర పప్పు / Andhra's Special Gongura pappu

గోంగూర పప్పు మాకు చాలా ఇష్టం.ఈ పప్పు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తుంటారు కానీ,నా చిన్నప్పటి నుండీ మా అమ్మ చేసే విధానంలో చేసే ఈ గోంగూర పప్పు రుచి మాత్రం చాలా బాగుంటుంది. 

 గోంగూర పప్పు / Andhra's  Special Gongura pappu


కావలసినవి 

గోంగూర - 2 పెద్దకట్టలు 
కందిపప్పు - 1 కప్పు 
 టమాటాలు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 10
వెల్లుల్లి 4
పసుపు - 1/2 tsp 
కారం - 1 tsp 
సాంబార్ పౌడర్ - 1 tsp
ఉప్పు - రుచికి సరిపడా 
నీళ్లు - 3 కప్పులు 

 తాలింపు కోసం 

నూనె - 2 tbsp
 ఉల్లిపాయ - 1
కరివేపాకు - 2 రెమ్మలు 
వెల్లుల్లి - 5
ఆవాలు, జీలకర్ర , పచ్చి శనగపప్పు - కొద్దిగా 
ఎండుమిర్చి - 3
కొత్తిమీర - కొద్దిగా 
 
తయారుచేసే విధానం 

గోంగూరని ఒలిచి, శుభ్రంగా కడిగి 
నీళ్లలోనుండి తీసి పక్కన ఉంచాలి. 

 టమాటా, ఉల్లిపాయ,పచ్చిమిర్చిలను 
చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. 


 కుక్కర్ లో1 కప్పు కందిపప్పు, 3 కప్పుల నీళ్లు పోసి,
గోంగూర, తరిగిన టమాట ,ఉల్లిపాయ, 
పచ్చిమిర్చి  ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. 
 


పసుపు,కారం , సాంబార్ పౌడరు కూడా వేయాలి.


అన్నీ వేశాక కుక్కర్ మూత  పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా 
ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.


ఉడికిన పప్పులో తగినంత ఉప్పు వేసి
పప్పుగుత్తితో పప్పుని మెత్తగా మెదపాలి


 తాలింపు కోసం 
  • ఉల్లిపాయలు సన్నగా నిలువు చీలికలు కట్ చేయాలి. 
  • వెల్లుల్లిని కొద్దిగా చితక్కొట్టాలి. 
  • కొత్తిమీర సన్నగా తరగాలి.


బాండీలో నూనె పోసి కాగాక, తాలింపు గింజలు వేసి 
బాగా వేగేదాకా వేయించాలి. 

ఉల్లిపాయలు ఎండుమిర్చి,వెల్లుల్లిపాయలు కూడా వేసి 
ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా వేయించాలి. 

చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.


వేగిన తాలింపుని మెదిపిన  పప్పులో వేసి 
బాగా కలిపితే గోంగూరపప్పు రెడీ





0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు