.

.

nani

25, జులై 2016, సోమవారం

చాక్లెట్ గులాబ్ జామున్ / Chocolate Gulab Jamuns

మామూలుగా గులాబ్ జామున్  Instant mix తో pack మీద ఇచ్చినట్లు తయారుచేస్తుంటాము. అదే గులాబ్ జామున్ Instant mix తో కొద్దిగా 
కొత్తగా చేసిన ప్రయత్నమే ఈ చాక్లెట్ గులాబ్ జామున్.. వెరైటీ రుచితో 
చాలా బాగున్నాయి

 చాక్లెట్ గులాబ్ జామున్ / Chocolate Gulab Jamuns


కావలసినవి 

గులాబ్ జామున్ Instant mix - 200g pack 
 పాలు - 1 కప్పు 
చాక్లెట్ చిప్స్ (chocolate chips)- 1 కప్పు 
నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

 షుగర్ సిరప్ కోసం 
పంచదార - 1 కప్పు 
 నీళ్లు - 2 కప్పులు
యాలకులపొడి - 1 tsp

తయారుచేసే విధానం 

గులాబ్ జామున్ మిక్స్ లో తగినన్ని పాలు కలుపుతూ 
సాఫ్ట్ గా పిండి ముద్ద తయారుచేసి 
 15 నిమిషాలు పక్కన ఉంచాలి.


 ఈలోపు స్టవ్ మీద గిన్నెలో పంచదార, నీళ్లు పోసి 
యాలకులపొడి వేసి చిక్కగా షుగర్ సిరప్ తయారుచేసి 
చల్లారనివ్వాలి.


15 నిమిషాల తర్వాత పిండిని చిన్న ఉండలుగా 
చేసి అందులో కొద్దిగా చాక్లెట్ చిప్స్ పెట్టి 
ఉండలు చుట్టాలి.   


ఇలా అన్నిటిలో చాక్లెట్ చిప్స్ పెట్టి
జామున్స్ అన్నీ తయారుచేసి పెట్టాలి.   


తయారయిన బాల్స్ ని వేడి నూనెలో వేసి 
medium heat మీద ఎర్రగా వేయించి తీసేయాలి.


వేగిన బాల్స్ లోపల చూస్తే చాక్లెట్ చిప్స్
ఇలా కరిగి ఉంటాయి.


వేయించిన బాల్స్ అన్నిటినీ తయారుచేసి పెట్టిన 
షుగర్ సిరప్ లో వేసి 30 నిమిషాలు నాననివ్వాలి. 


టేస్టీ చాక్లెట్ గులాబ్ జామున్ రెడీ.. 
చాక్లెట్ టేస్ట్ గులాబ్ జామున్ తో కలిసి చాలా బాగుంది. 








0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు