.

.

nani

30, జులై 2016, శనివారం

కొబ్బరి పచ్చడి / Coconut Chutney

కొబ్బరి పచ్చడి ఇడ్లీలోకి,దోశల్లోకి ఖచ్చితంగా ఉండాల్సిన చట్నీ మాత్రమే కాదు,వేడి అన్నంలో కొబ్బరిపచ్చడి వేసుకుని,నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది.చెయ్యటం కూడా సింపుల్ గా ఈజీగా అవుతుంది. 

కొబ్బరి పచ్చడి / Coconut Chutney


కావలసినవి 

కొబ్బరికాయ  - 1
పచ్చిమిర్చి - 10 -15
 చింతపండు - కొద్దిగా /(రుచిని బట్టి )
వెల్లుల్లి రెబ్బలు - 5
 జీలకర్ర - 1 tsp 
పుదీనా - కొద్దిగా
ఉప్పు  - రుచికి సరిపడా 
 నూనె - 2 tsp

తయారుచేసే విధానం 

కొబ్బరిని చిన్న ముక్కలుగా కోయాలి. 

 బాండీలో నూనె వేసి కాగాక,కొబ్బరిముక్కలు,పచ్చిమిర్చి,
చింతపండు వేసి వేయించాలి


 కొబ్బరిముక్కలు,పచ్చిమిర్చి వేగేదాకా 
5 నిమిషాలు మూతపెట్టి  వేయించాలి 


కొబ్బరిముక్కలు వేగాక, పుదీనా కూడా వేసి 
స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.  


వేయించిన కొబ్బరిముక్కలు,పచ్చిమిర్చి, 
పుదీనాతో పాటు చింతపండు,వెల్లుల్లి రెబ్బలు,
జీలకర్ర, తగినంత ఉప్పు అన్నీ  మిక్సీజార్ లో వేసి 

కొద్దిగా నీళ్లు పోసి, మెత్తగా పచ్చడి గ్రైండ్ చేయాలి


టేస్టీ కొబ్బరిపచ్చడి రెడీ.. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు