.

.

nani

13, జులై 2016, బుధవారం

గ్రీన్ మసాలా చికెన్ బిర్యాని / Green Masala Chicken Biryani

బిర్యానీ చాలామంది ఇష్టపడతారు.ఎన్నోరకాలు కూడా ఉంటాయి.చికెన్ బిర్యానీలాగా మరీ స్పైసీగా లేకుండా కలర్ ఫుల్ గా మంచి ఫ్లేవర్ తో ఉండే ఈ గ్రీన్ మసాలా చికెన్ బిర్యానీ చేయటం కొంచెం కష్టమే అయినా చాలా రుచిగా బాగుంటుంది.
ఇదే గ్రీన్ మసాలాతో చేసిన - గ్రీన్ మసాలా చికెన్ 


 గ్రీన్ మసాలా చికెన్ బిర్యాని



కావలసినవి 

బాస్మతి రైస్ - 1/2 k.g
 చికెన్ - 1/2 k.g 
   పెరుగు - 1 tbsp 
పసుపు - 1/2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 tsp
గరం మసాలా పొడి - 1 tsp
జీలకర్ర పొడి - 1 tsp
 బిర్యానీ ఆకు - 1
నూనె + నెయ్యి - 1 /2 కప్పు 
 నిమ్మకాయ - 1 

గార్నిష్ కోసం

ఉల్లిపాయలు - 4 (నిలువుగా చీలికలు కోయాలి )
జీడిపప్పు - 10 


గ్రీన్ మసాలా పేస్ట్ కోసం కావలసినవి 

కొత్తిమీర - 1 కట్ట 
పుదీనా - 1 కట్ట 
కరివేపాకు - 5 రెమ్మలు 
పచ్చిమిర్చి - 10 (కారం తక్కువ కావాలంటే తగ్గించొచ్చు)
అల్లం - పెద్ద  ముక్క 
వెల్లుల్లిపాయ - 1 పెద్దది
లవంగాలు - 4
యాలకులు - 2
దాల్చినచెక్క - చిన్నముక్క
ధనియాలు - 1/4 tsp
షాజీరా - 1/4 tsp 

తయారుచేసే విధానం

 చికెన్ శుభ్రంగా కడిగి,కారం,ఉప్పు,పసుపు,
గరం మసాలా పొడి,జీలకర్రపొడి వేసి బాగా కలిపి మారినేట్ చేయాలి.



గ్రీన్ మసాలా కోసం తీసుకున్న కొత్తిమీర,పుదీనా, కరివేపాకు
వెల్లుల్లి,  అల్లం ముక్కలు చేసి పెట్టాలి. 



మిక్సీ జార్ లో కొత్తిమీర,పుదీనా,కరివేపాకు వెల్లుల్లి,అల్లం ముక్కలు,
 లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ధనియాలు , షాజీరా
అన్నీ వేసి మెత్తగా  పేస్ట్ తయారుచేయాలి. 



గ్రీన్ మసాలా పేస్ట్ రెడీ అయింది.



 ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ లో
గ్రీన్ మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి.



పెరుగు,నిమ్మరసం కూడా వేసి కలపాలి 



మొత్తం బాగా కలిపి 1 గంట మారినేట్ చేయాలి



బాండీలో నెయ్యి,నూనె కలిపి 1/2 కప్పు పోసి
జీడిపప్పు వేయించి పక్కన పెట్టాలి.



అదే నూనెలో చీలికలు చేసిన ఉల్లిపాయలు వేసి
Fried onions తయారుచేసి పక్కన పెట్టాలి.



కొన్ని Fried onions మారినేట్ చేసిన చికెన్ లో వేసి కలపాలి 



గార్నిష్ కోసం జీడిపప్పు,Fried onions
కొత్తిమీర పుదీనా పక్కన పెట్టుకోవాలి



బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి,10 నిమిషాలు నానబెట్టాలి.

ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల చొప్పున నీళ్లు పోసి,
 కొద్దిగా నెయ్యి, 2లవంగాలు, 2యాలకులు, కొద్దిగా దాల్చినచెక్క,ధనియాలు , షాజీరా,జాపత్రి,బిర్యానీ ఆకు వేసి మరిగాక నానబెట్టిన బియ్యం కూడా వేసి పూర్తిగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించి అన్నంలో నీళ్లు వంచి పక్కన పెట్టాలి.



ఇప్పుడు బాండీలో జీడిపప్పు,ఉల్లిపాయలు వేయించిన నూనెలోనే
మారినేట్ చేసిన చికెన్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి 



15 నిమిషాలు ఉడికించిన చికెన్ లో కొత్తిమీర చల్లాలి




ఇప్పుడు అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెలో 
ఒక వరస చికెన్ వేయాలి.



చికెన్ మీద ఉడికించిన  రైస్ ఒక వరస
(layers)  వేయాలి



ఇలా చికెన్, రైస్ అంతా  layers గా వేయాలి



చికెన్,రైస్ అంతా లేయర్స్ గా వేసిన తర్వాత 
పైన నెయ్యి వెయ్యాలి



ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేయాలి.



ఆవిరి బయటకు పోకుండా సన్నని మంట మీద 
10 నిమిషాలు ఉడికించాలి.
*దమ్ బిర్యానీ మూతని పిండితో  కవర్ చేసి  చేస్తుంటారు. ఈజీగా ఉంటుందని ఇలా చేశాము*



గ్రీన్ మసాలా చికెన్ బిర్యాని రెడీ



ఈ బిర్యానీ పెరుగురైతా తో తింటే బాగుంటుంది. 




0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు