.

.

nani

19, జులై 2016, మంగళవారం

కాకరకాయ కారం / Kakarakaya Fry / Bitter Gourd Fry


కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.షుగర్ ని తగ్గిస్తుంది,లివర్ ఆరోగ్యానికి కూడా మంచిది.మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. 

కాకరకాయ కారం / Kakarakaya Fry


కావలసినవి 

కాకరకాయలు - 1/4 k.g 
వెల్లుల్లిపాయ - 1
కారం - 1 tbsp 
ఉప్పు - 1/2 tbsp 
జీలకర్ర - 1/2 tsp
పసుపు - 1/2 tsp 
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 2 tbsp

తయారుచేసే విధానం

కాకరకాయల్నిసన్నగా చక్రాల్లాగా తరగాలి.


మిక్సీ జార్ లో కారం,వెల్లుల్లిపాయలు ,ఉప్పు 
వేసి వెల్లుల్లికారం తయారుచేసి పెట్టాలి.


బాండీలో నూనె పోసి కాగాక తరిగిన 
కాకరకాయలు వేసి వేయించాలి.


వేగుతున్న కాకరకాయల్లో కొద్దిగా పసుపు,ఉప్పు 
వేసి  మగ్గించాలి. 
*ఉప్పు,పసుపు వేస్తే ముక్కలు తొందరగా మగ్గుతాయి*


కాకరకాయ బాగా వేగాక కరివేపాకు,జీలకర్ర వేసి వేయించి,
వెల్లుల్లి కారం కూడా వేసి అంతా కలిసేలా కలపాలి.


కారం కలిపిన తర్వాత 2 నిమిషాలు వేయించి 
స్టవ్ ఆఫ్ చేయాలి.


కాకరకాయ కారం / Fry రెడీ .. అన్నంలో అలాగే తిన్నా,
సాంబార్ లో సైడ్ డిష్ గా తిన్నా బాగుంటుంది.


0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు