.

.

nani

20, జులై 2016, బుధవారం

కాకరకాయ పులుసు / Kakarakaya Pulusu / Bittergourd Curry


కాకరకాయ చేదు కదా ఫ్రై అంటే తినొచ్చు కానీ పులుసు రుచి బాగోదేమో అనిపిస్తుంది .కానీ అన్నీ సరిగ్గా చేయటం కుదిరితే ఫ్రై కంటే "కాకరకాయ పులుసు" చాలా బాగుంటుంది,కూరలో  తీపి ఇష్టపడని వాళ్ళు బెల్లం వేయకుండా కూడా చేసుకోవచ్చు.

 కాకరకాయ పులుసు /  Kakarakaya Pulusu


 కావలసినవి 

కాకరకాయలు - 1/4 k.g 
 ఉల్లిపాయ - 1
టమాటా - 2
పచ్చిమిర్చి  - 2
కరివేపాకు - 2 రెమ్మలు 
చింతపండు - నిమ్మకాయంత 
బెల్లం - 1 tbsp 
పసుపు - కొద్దిగా 
కారం - 1 tsp 
ఉప్పు - రుచికి సరిపడా
ఎండుమిర్చి - 2
తాలింపు గింజలు 
పచ్చిశనగపప్పు ,ఆవాలు,జీలకర్ర - కొద్దిగా


తయారుచేసే విధానం

కాకరకాయలు,టమాటా,ఉల్లిపాయ,పచ్చిమిర్చి 
అన్నిటినీ సన్నగా తరగాలి.


సన్నగా తరిగిన కాకరకాయ ముక్కల్లో 
కొంచెం పసుపు వేసి బాగా కలిపి, కొద్దిగా నీళ్లు పోసి 
గట్టిగా పిండి నీళ్లు వంపేసి పక్కన పెట్టాలి


బాండీలో నూనె పోసి కాగాక,తాలింపు గింజలు,
ఎండుమిర్చి వేసి వేగాక,ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి


ఉల్లిపాయలు వేగాక కాకరకాయ ముక్కలు వేసి 
మెత్తగా మగ్గేదాకా వేయించాలి.


చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టి,
చిక్కగా  పులుసు పిండి పిప్పి తీసేయాలి. 

చింతపండు పులుసును వేగుతున్న 
కాకరకాయ ముక్కల్లో పోయాలి. 


1 tbsp బెల్లం వేసి బాగా కలిపి ఉడికించాలి.


ఉడుకుతున్న కూరలో సన్నగా తరిగిన టమాటా ముక్కలు,
కారం వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించాలి.


టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత 
1/2 గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ


తీపి,పులుపు రుచితో చేదు లేకుండా 
కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది.



0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

.

 

Followers

Blogs

.

.

.


***

నానీ కిచెన్

మొత్తం పేజీ వీక్షణలు